బెంగళూరు రేవ్ పార్టీ(Bangalore rave party) ఇంకా కలకలం రేపుతూనే ఉంది.
బెంగళూరు రేవ్ పార్టీ(Bangalore rave party) ఇంకా కలకలం రేపుతూనే ఉంది. ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై నటి హేమ రియాక్టయ్యారు. తాను ఎలాంటి డ్రగ్స్(Drugs) తీసుకోలేదని పునరుద్ఘాటించారు. బెంగళూరు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోలేదన్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. ఛార్జీషీట్‌లో(Chargesheet) తన పేరు ఉన్నట్లు సమాచారం తనకు అందిందని హేమ చెప్పుకొచ్చారు. బెంగళూరు పోలీసులు మాత్రం హేమ డ్రగ్స్ తీసుకున్నారనే అంటున్నారు. ఛార్జ్‌షీట్‌లో ఆ విషయమే ప్రస్తావించారు. 1086 పేజీలతో ఛార్జ్‌షీట్‌ను రెడీ చేసిన పోలీసులు కోర్టుకు అందించారు. హేమ ఫ్రెండ్ వాసు అనే వ్యక్తి ఆహ్వానించడం వల్లే ఆమె రేవ్ పార్టీకి వెళ్లినట్లు బెంగుళూరు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో తెలిపారు. ఇదిలా ఉంటే గుడ్‌న్యూస్ అంటూ హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. అఫీషియల్ చార్జిషీట్‌లోనూ నాకు నెగెటివ్ వచ్చిందని అందులో చెప్పుకున్నారు. అనవసరంగా తనపై కొందరు నిందలు వేస్తున్నారని ఆవేదన చెందారు. తాను ఎవర్నీ వదిలిపెట్టనని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇంత కన్ఫ్యూజన్ ఏమిటో అర్థం కావడం లేదని కామెంట్ చేస్తున్నారు.