చాన్నాళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ వస్తున్నారు ప్రగతి(Pragathi). ఒకప్పడు హీరోయిన్‌గా నటించిన ఈమె తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అత్తగా, అమ్మగా, అక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో(social Media) ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు ప్రగతి.
చాన్నాళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ వస్తున్నారు ప్రగతి(Pragathi). ఒకప్పడు హీరోయిన్‌గా నటించిన ఈమె తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. అత్తగా, అమ్మగా, అక్కగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో(social Media) ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటారు ప్రగతి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్‌లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలను చెప్పారు. ఓ సినిమా సెట్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్టు తెలిపారు. తనను వేధింపులకు గురి చేసింది ఓ స్టార్ కమెడియన్(Comedian) అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అతడు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయానని ప్రగతి అన్నారు.
'అతడు సెట్‌లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగానే ఉంటారు. అయితే ఒకరోజు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తన నాకు షాక్‌నిచ్చింది. దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆ రోజు నాకు ఏ పని చేయాలనిపించలేదు. భోజనం కూడా చేయలేకపోయా. కనీసం టీ కూడా తాగాలనిపించలేదు.' అని ప్రగతి చెప్పుకొచ్చారు. తర్వాత షూటింగ్ అయిపోయి అతడు ఇంటికి వెళ్లిపోతుంటే ఆపి మరీ క్యారవాన్‌లోకి తీసుకెళ్లాను. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అని నిలదీశాను. నేను అక్కడే రియాక్ట్ అయి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోండి. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండిపోయాను' అని ప్రగతి వివరించారు. అయితే ఆమె పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకరంగా ప్రవర్తిచిన స్టార్ కమెడియన్ ఎవరో మాత్రం ఆమె చెప్పలేదు. ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.