మొత్తానికి అనుకున్నది సాధించాడు తమిళ స్టార్ హీరో విశాల్(Vishal). ఆయన కంప్లైట్ పై కదిలిన కేంద్రం .. సెన్సార్(Censor Board) కు సబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులుచేసింది.

మొత్తానికి అనుకున్నది సాధించాడు తమిళ స్టార్ హీరో విశాల్(Vishal). ఆయన కంప్లైట్ పై కదిలిన కేంద్రం .. సెన్సార్(Censor Board) కు సబంధించిన విషయాల్లో మార్పులు చేర్పులుచేసింది.

మొత్తానికి అనుకున్నది సాధించాడు విశాల్.సెన్సారికి సబంధించి భారీ మార్పలకు ఆయన కారణం అయ్యాడు. సెన్సార్ బోర్డ్ పై ఆరోనపణలు చేసి సంచలనంగా మారిన విశాల్. వాటిని నిరూపించి సెన్సార్ కమిటీలో భారీ మార్పులకు కారణం అయ్యారు. ఇక తాజాగా కొత్త ఉత్తర్వులు చేసిన కేంద్ర సమాచారం మంత్రిత్వ శాఖ... తమిళం నుంచి హిందీలోకి అనువాదమయ్యే డబ్బింగ్‌ సినిమాల సెన్సార్‌ కార్యక్రమాలను కూడా ఇకపై చెన్నైలోనే పూర్తి చేయనున్నారు.

ఈ విధానం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు కొనసాగుతుంది. రీసెంట్ గా హీరో విశాల్‌ చేసిన రచ్చ తెలిసిందే.. ఆయన నటించిన మార్క్‌ ఆంటోనీ సినిమా హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కు సెన్సార్‌ సర్టిఫికెట్‌ మంజూరు విషయంలో సెన్సార్ బోర్డ్ మెంబర్స్ పై ఆరోపణలు చేశాడు. తమ సినిమా సెర్సార్ చేసేందుకు 6.50 లక్షల లంచం ఇచ్చినట్టు ఆరోపణలు చేశారు. దీనిపై సీరియస్‌ అయిన కేంద్రం... ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి తాజాగా కొత్త ఉత్తర్వులు జారీచేశారు. ఇకపై సౌత్ సినిమాలకు సబంధించిన సినిమాలకు సెన్సార్‌ కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతాయో.. అదే కార్యాలయంలో తమిళం నుంచి హిందీలోకి డబ్బింగ్ అయ్యే మూవీస్ సెన్సార్ కూడా అక్కడే జరిగి.. సర్టిఫికెట్‌ను పొందొచ్చని తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే ఆరు నెలల పాటు ఈ విధానం అమలు చేయనున్నారు.

ఇప్పటివరకు హిందీలోకి అనువాదం చేసే తమిళ చిత్రాలకు సెన్సార్‌ కార్యక్రమాలు ముంబై కార్యాలయంలో చేస్తున్న విషయం తెల్సిందే. రాబోయే ఆరు నెలల పాటు ఈ విధానంలో మార్పు రానుంది. ఇది వర్కవుట్ అయితే.. ఇకపై ఇదే విధానాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

Updated On 22 Oct 2023 5:33 AM GMT
Ehatv

Ehatv

Next Story