ఒకప్పటి అందాల నటి సిల్క్‌ స్మిత(Silk smitha) జీవితం ఆనందవిషాదాల సమ్మేళనం! ఆ అభినయతారకు ఎంతో మంది అభిమానులు! ఆమె మరణించి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా గుండెల్లో పదిలంగా పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరో బయోపిక్‌(BIOPIC) రాబోతున్నది.

ఒకప్పటి అందాల నటి సిల్క్‌ స్మిత(Silk smitha) జీవితం ఆనందవిషాదాల సమ్మేళనం! ఆ అభినయతారకు ఎంతో మంది అభిమానులు! ఆమె మరణించి సుమారు నాలుగు దశాబ్దాలు అవుతున్నా గుండెల్లో పదిలంగా పెట్టుకున్నవారు ఎందరో ఉన్నారు. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని మరో బయోపిక్‌(BIOPIC) రాబోతున్నది. పాన్‌ ఇండియా(Pan India Movie) లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను(First Look) స్మిత బర్త్‌డే సందర్బంగా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో ఇండియన్‌ ఆస్ట్రేలియన్‌ నటి చంద్రికా రవి(Chandrika Ravi) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జయరామ్‌(Jayaram) అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. సిల్క్‌ స్మిత ది అన్‌టోల్డ్‌ స్టోరీ పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో చంద్రిక రవి అచ్చంగా సిల్క్‌ స్మితలాగే కనిపించారు. ప్రస్తతం షూటింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా విడుదలైన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. చంద్రికా రవి గతంలో పలు తమిళ సినిమాల్లో నటించారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డిలో ఓ పాటలో మెరిశారు. ఇంతకు ముందు సిల్క్‌ స్మిత జీవితాన్ని ఆధారం చేసుకుని బాలీవుడ్‌లో డర్టీ పిక్చర్‌ పేరుతో ఓ సినిమా తీశారు. విద్యాబాలన్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఇందులో నటించిన విద్యాబాలన్‌కు జాతీయ పురస్కారం లభించింది.

Updated On 2 Dec 2023 3:46 AM GMT
Ehatv

Ehatv

Next Story