✕
Singer dhee Unknown Story : ‘చమ్కీల అంగీ’ పాట పాడిన అమ్మాయి ఎవరో తెలిస్తే షాకవుతారు.!
By EhatvPublished on 27 March 2023 4:54 AM GMT
‘చమ్కీల అంగీలేసి ఓ వదినా ’ అంటూ రీసెంట్గా పాటపాడి ట్రెండింగ్‌లో ఉంది ఈ అమ్మాయి. అదేనండి.. నూడుల్స్ లాంటి కురులతో.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. లిరికల్ వీడియోలో మెరిసిన పాప. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాపే కనిపిస్తోంది. అసలు ఈ పాప ఎవరో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే మీరు.. !

x
Dhee
-
- ‘చమ్కీల అంగీలేసి ఓ వదినా ’ అంటూ రీసెంట్గా పాటపాడి ట్రెండింగ్‌లో ఉంది ఈ అమ్మాయి. అదేనండి.. నూడుల్స్ లాంటి కురులతో.. ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. లిరికల్ వీడియోలో మెరిసిన పాప. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాపే కనిపిస్తోంది. అసలు ఈ పాప ఎవరో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే మీరు.. !
-
- మనందరికీ తెలిసిన ఈ అమ్మాయి పేరు ధీ (Dhee).. అసలు పేరు ధీక్షిత వెంకదేశన్ (Dheekshitha Venkadeshan). ఈమె శ్రీలంక తమిళ సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ సింగర్, ఆమె సవతి తండ్రి సంతోష్ నారాయణ్ (Santhosh Narayanan) సినిమాల్లో అండ్ ఆల్బమ్‌లలో ఎక్కువగా పాటలు పాడింది. అయితే ఈ అమ్మాయి 1998 జూన్ 26న శ్రీలంకలోని జాఫ్నాలో వెంకటేశన్, మీనాక్షి అయ్యర్ దంపతులకు జన్మించింది.
-
- ఆమె తల్లి కర్నాటక సంగీత విద్వాంసురాలు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్‌కు సవతి కూతురు ధీ. శ్రీలంకలో పుట్టి, ఆస్ట్రేలియాలో చదువుకుంది ధీ. మ్యూజిక్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఆమె 14ఏళ్లకే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2013లో వచ్చిన పిజ్జా2:విల్లా (Pizza II: Villa) చిత్రంలో ‘డిస్కో మహిళ’ అనే పాటలను పాడింది ధీ. ఆ తర్వాత వచ్చిన ‘కోకిల’ (Kokila) చిత్రంలోనూ ‘ఎండ మాప్లా’ అనే పాటపాడింది ఈ అమ్మాయి.
-
- 2014లో ‘మద్రాస్’ (Madras) చిత్రంలో ‘నాన్ నీ’ అనే పాటపాడిన తర్వాత బెస్ట్ ఫీమేల్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది ధీ. ఎక్కువ శాతం ఆమె తండ్రి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాల్లో సాంగ్స్ పాడింది దీక్షిత. తమిళంలో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇటు తెలుగులో ‘ఆకాశమే హద్దురా’ చిత్రంలో ‘కాటుక కనులే’ ‘మారి2’ చిత్రంలో ‘రౌడీ బేబీ’, ‘గురు’చిత్రంలో ‘ఓ సక్కనోడా’ పాటలు బాగా ఫేమస్ అయ్యాయి.
-
- అయితే ఇన్ని రోజులు ఆమె పాడిన పాటలు అందరికీ తెలుసు కానీ, ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక ‘చమ్కీల అంగీలేసి..’ సాంగ్‌తో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరవడంతోపాటు నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది ధీ. ఇక తెలంగాణ యాసలో ఇంతటి కష్టమైన పాటను పాడినందుకు ఈ తమిళ సింగర్‌కి పెద్ద ఎత్తున కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

Ehatv
Next Story