సుమారు ఏడేళ్ల విరామం తర్వాత కరణ్ జోహార్(Karan Johar) మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ(Rockey Aur Rani Ki Prem Kahani) సినిమా ఈ నెల 28న విడుదల కాబోతున్నది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకులు అమితాసక్తిని పెట్టుకున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్(Ranveer Singh), అలియాభట్(alia Bhatt) ప్రధాన పాత్రల్లో నటించారు.
సుమారు ఏడేళ్ల విరామం తర్వాత కరణ్ జోహార్(Karan Johar) మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ(Rockey Aur Rani Ki Prem Kahani) సినిమా ఈ నెల 28న విడుదల కాబోతున్నది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకులు అమితాసక్తిని పెట్టుకున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్‌సింగ్(Ranveer Singh), అలియాభట్(alia Bhatt) ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో కొన్ని సంభాషణలు, సన్నివేశాలపై సెన్సార్‌బోర్డు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అశ్లీల పదాలతో పాటు రాజకీయ సంబంధమైన డైలాగులను తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది. సెన్సార్ ఆదేశాల మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సంబంధించిన ఓ దృశ్యాన్ని పూర్తిగా తొలగించారని తెలిసింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేపథ్యంలో వచ్చే ఓ సుదీర్ఘమైన డైలాగ్‌ను కూడా మార్చాలని మూవీ మేకర్స్‌కు సెన్సార్ సూచించింది. ఓ మద్యపాన బ్రాండ్ పేరును ఉపయోగించడంతో పాటు మహిళల లోదుస్తుల గురించిన పదాల పట్ల కూడా సెన్సార్ బోర్డ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచేలా ఆ పదాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ చిత్రంలో జయాబచ్చన్, షబానా ఆజ్మీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.