యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన దేవర(Devara) పార్ట్-1 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన దేవర(Devara) పార్ట్-1 సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన సినిమా కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొరటాల శివ(Koratala) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అటు ఎన్టీఆర్‌కు, ఇటు శివకు ప్రిస్టేజియస్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్(Janhvi kapoor) ఈ సినిమాతోనే తెలుగులో అడుగుపెడుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ మధ్యనే దేవర ట్రైలర్ విడుదలయ్యి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నది. దేవర సినిమాకు సెన్సార్(censor) కూడా పూర్తయ్యింది. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయాలని డిసైడైన సెన్సార్ బోర్డు ఓ నాలుగు మార్పులు చేయాలని ఆదేశించింది. ప్రధానంగా భార్య, తల్లిని కడుపులో తన్నే దృశ్యంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఈ సీన్ మార్చాలని చెప్పింది. ఇక ఫైట్ సీన్‌లో కత్తిపై మనిషి వేలాడుతున్న దృశ్యాన్ని కూడా కట్ చేసింది. సముద్రంలో ఎన్టీఆర్ సొరచేపను స్వారీ చేస్తున్న దృశ్యానికి మేడ్ విత్ సీజీఐ అనే డిస్‌క్లయిమర్ వేయాలని సూచించింది. ఈ సన్నివేశంలో ఎలాంటి జంతుహింస జరగలేదని టిక్కర్ వేయాలని ఆదేశించింది. కాగా.. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 58 నిమిషాలు ఉండనుంది. అంటే దాదాపు మూడు గంటలన్నమాట! ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. నందమూరి కళ్యాణ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.