రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తీసిన ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఏమైందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దర్శకుడిని, మాటల రచయితను బండబూతులు తిట్టారు. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి, తమ ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీశారు. పాపం ప్రభాస్‌కు పెద్ద డిజాస్టర్‌ను ఇచ్చారు. ఇప్పుడా చిత్రాన్ని అందరూ మర్చిపోయారు అనుకునేలోపు మరో సినిమా వివాదాలు రేకెత్తించడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడి సినిమా.

రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తీసిన ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఏమైందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దర్శకుడిని, మాటల రచయితను బండబూతులు తిట్టారు. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి, తమ ఇష్టం వచ్చినట్టుగా సినిమా తీశారు. పాపం ప్రభాస్‌కు పెద్ద డిజాస్టర్‌ను ఇచ్చారు. ఇప్పుడా చిత్రాన్ని అందరూ మర్చిపోయారు అనుకునేలోపు మరో సినిమా వివాదాలు రేకెత్తించడానికి రెడీగా ఉంది. ఎందుకంటే ఇది భగవంతుడి సినిమా. సెన్సార్‌ బోర్డు మాత్రం ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే ఓ మై గాడ్‌ 2(Oh My God-2). ఇందులో అక్షయ్‌కుమార్‌(Akshay Kumar) శివుడిగా నటించాడు. 2012లో వచ్చిన ఓ మై గాడ్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. మొదటి భాగంలో కూడా అక్షయ్‌ కుమారే దేవుడిగా కనిపించాడు. సెకండ్‌ పార్ట్‌లో కూడా అదే పాత్రను పోషించాడు అక్షయ్‌కుమార్‌. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతున్నది. ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ దగ్గర నుంచి టీజర్‌ వరకు చూస్తే ఇది దేవుడి సినిమానే అనిపిస్తోంది. కానీ ఇందులో అంతకు మించిన కాన్సెప్ట్ ఏదో ఉందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట! ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే బాగా వినిపించింది. ఇప్పుడది నిజమేనని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఈజీగా సెన్సార్‌ సర్టిఫికెట్ దొరకలేదు. రెండు వారాలనుంచి ఈ సినిమాపై సెన్సార్‌ బోర్డు తీవ్ర తర్జనభర్జన పడింది. మొదట U/A సర్టిఫికెట్ ఇచ్చి, కొన్ని సన్నివేశాలను తొలగించాలని చెప్పారు. దర్శక, నిర్మాతలు దీనికి అసలు ఒప్పుకోలేదట! దీంతో సెన్సార్‌ బోర్డు(censor Board) ఎ సర్టిఫికెట్‌ ఇచ్చిందట! సెన్సార్‌ బోర్డు మొత్తం 27 కట్స్‌ చెప్పిందట. అందుకు కారణం సినిమాలోని కంటెంటే! ఇంతకీ ఓ మై గాడ్‌ 2 కథ ఏమిటంటే ఓ కుర్రాడు గే. కాలేజీలో ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. అందరూ ఆ కుర్రాడిని ఏడిపిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కాలేజీలో ప్రొఫెసర్‌కు ఈ విషయం తెలిసి చాలా బాధపడతాడు. పిల్లలకు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటాడు. కాలేజీలో పాఠాలు కంపల్సరీ చేస్తాడు. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. భగవంతుడు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భూమ్మీదకు వచ్చిన శివుడు.. ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అన్నదే సినిమా కథాంశం. అక్షయ్‌ కుమార్‌ శివుడిగా కనిపిస్తుండటంతో పైన చెప్పిన కథ నిజమే అనిపిస్తుంది. శివుడిని అర్థనారీశ్వరుడిగా కొలుస్తుంటారు. శివుడు-పార్వతి కలిసి ఒకే శరీరంలో ఉంటారు. అలాగే అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉంటే గే అని పిలుస్తుంటారు. మొత్తంగా ఓ మై గాడ్‌ 2 సినిమా వివాదాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated On 2 Aug 2023 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story