ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొందరు సినీ తారలు తళుక్కుమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) విజయం సాధించారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranauth) గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నది.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొందరు సినీ తారలు తళుక్కుమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌(Pawan kalyan), నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) విజయం సాధించారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌(Kangana Ranauth) గెలుపొంది పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నది. తన సొంత పట్టణం మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్‌ కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌పై(Vikram Adhitya) 71 వేల ఓట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఏపీలోని పిఠాపురం(Pithapuram) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌ భారీ మెజారిటీతో వంగ గీతపై గెలుపొందాడు. అలాగే హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్‌ సాధించాడు. ఇప్పటికే రెండుసార్లు గెలుపొందిన బాలయ్యకు ఇది మూడో విజయం. కేరళలో మలయాళ నటుడు సురేశ్‌ గోపీ కూడా గెలుపొందారు. బీజేపీ తరఫున త్రిసూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సురేశ్‌ గోపీ సుమారు 75 వేల మెజారిటీతో గెలుపొందాడు. కేరళలో బీజేపీ బోణి కొట్టిందంటే అందుకు కారణం సురేశ్‌ గోపీ ఆకర్షణే! ఉత్తరప్రదేశ్ లోని మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న హేమమాలినికి కూడా ఘన విజయం దక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌ సభ నియోజవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీ చేసిన పాపులర్‌ నటుడు రవికిషన్‌కు కూడా భారీ విజయం దక్కింది. అయితే టెలివిజన్‌ రాముడు అరుణ్‌ గోవిల్‌ను మాత్రం పరాజయం వెక్కిరించింది.

Updated On 5 Jun 2024 12:41 AM GMT
Ehatv

Ehatv

Next Story