తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం యోగిబాబు(Yogi babu) స్టార్‌ కమెడియన్‌. ఆయన కాల్షీట్లు దొరకడం గగనం! ముందుగా యోగిబాబు డేట్స్‌ దొరికిన తర్వాత స్టార్‌ హీరోలను బుక్‌ చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. యోగిబాబు తెలుగువారికి కూడా తెలుసు. కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడాయన తన ముద్దుల కూతురు మొదటి బర్త్‌డేను(First Birthday) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తమిళ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం యోగిబాబు(Yogi babu) స్టార్‌ కమెడియన్‌. ఆయన కాల్షీట్లు దొరకడం గగనం! ముందుగా యోగిబాబు డేట్స్‌ దొరికిన తర్వాత స్టార్‌ హీరోలను బుక్‌ చేసుకునే పరిస్థితి అక్కడ ఉంది. యోగిబాబు తెలుగువారికి కూడా తెలుసు. కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడాయన తన ముద్దుల కూతురు మొదటి బర్త్‌డేను(First Birthday) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తమిళ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య(Suriya), కార్తీ(Karthi), విజయ్ సేతుపతి(Vijay sethupathi) పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యోగిబాబు తనదైన కామెడీతో అభిమానులను సంపాదించుకున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. రజనీకాంత్‌ లేటెస్ట్‌ చిత్రం జైలర్‌లోనూ యోగిబాబు ప్రేక్షకులను నవ్వించారు. షారుక్‌ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్‌లో కనిపించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా అయాలన్‌లో నటిస్తున్నారు యోగిబాబు

Updated On 25 Oct 2023 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story