మెగా ఫ్యామిలీలోకి వారసురాలు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి హైద్రాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన జాయిన్ కాగా.. ఈ తెల్లవారుజామున అమ్మాయి పుట్టింది. కుటుంబంలోకి వారసురాలు ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది.

Celebrations in Mega Family Ramcharan and his wife Upasana welcome their baby
మెగా ఫ్యామిలీ(Mega Family)లోకి వారసురాలు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కోడలు, రాంచరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) పండంటి ఆడబిడ్డ(Baby Girl))కు జన్మనిచ్చింది. నిన్న రాత్రి హైద్రాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్(Jublili Hills) అపోలో ఆస్పత్రి(Apollo Hospital)లో ఉపాసన జాయిన్ కాగా.. ఈ తెల్లవారుజామున అమ్మాయి పుట్టింది. కుటుంబంలోకి వారసురాలు ఎంట్రీ ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. అభిమానులు మెగా వారసురాలు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
పెళ్లయిన పదేళ్లకు ఉపాసన తొలి బిడ్డ(First Baby)కు జన్మనిచ్చింది. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ - ఉపాసన జంట తల్లిదండ్రులు కానున్నట్టు గత యేడాది డిసెంబర్ 12న ప్రకటించారు. ఉపాసన ఇన్‌స్టా(Insta)లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అభిమానులతో పంచుకునేది. పోస్టులకు స్పందించే అభిమానులుతమనదైన శైలిలో కామెంట్లు(Comments) చేసేవారు.
