డాలర్‌ డ్రీమ్స్‌తో అమెరికాకు వెళ్లే భారతీయులు కాసింత కుదుటపడిన తర్వాత గ్రీన్‌ కార్డు(Green Card) కోసం కలలు కనడం మొదలుపెడతారు. వారి అంతిమ లక్ష్యం గ్రీన్‌కార్డే. ఒక్క భారతీయులే కాదు, చాలా మంది వలసదారులు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది.

అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూపులు
అది అందుకోకుండానే ప్రాణాలు కోల్పోనున్న నాలుగు లక్షల మంది భారతీయులు

డాలర్‌ డ్రీమ్స్‌తో అమెరికాకు వెళ్లే భారతీయులు కాసింత కుదుటపడిన తర్వాత గ్రీన్‌ కార్డు(Green Card) కోసం కలలు కనడం మొదలుపెడతారు. వారి అంతిమ లక్ష్యం గ్రీన్‌కార్డే. ఒక్క భారతీయులే కాదు, చాలా మంది వలసదారులు గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే ఆ కార్డు జారీలో జరుగుతున్న జాప్యం కారణంగా సుమారు నాలుగు లక్షల మంది భారతీయులు ఆ కార్డును అందుకోకుండానే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని ఓ నివేదికలో తేలింది. అమెరికాకు చెందిన క్యాటో ఇన్స్‌టిట్యూట్‌(Cato Institute) ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం అమెరికా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసు దగ్గర గ్రీన్‌ కార్డు కోసం సుమారు 11 లక్షల మంది భారతీయుల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీరందరికీ ఇప్పట్లో గ్రీన్‌కార్డు రావడం దుర్లభం.

ప్రస్తుతం అమెరికా ఎంప్లాయిమెంట్‌ శాఖ దగ్గర మొత్తం 18 లక్షల గ్రీన్‌ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిల్లో 63 శాతం అప్లికేషన్లు భారతీయులవేనని(Indian) తెలుస్తోంది. వీటికి తోడు ఫ్యామిలీ సిస్టమ్‌తో లింకు ఉన్న గ్రీన్‌ కార్డులు సుమారు 83లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయట! కొత్తగా గ్రీన్‌కార్డు కోసం అప్లై చేసుకున్న ఇండియన్లకు వెయింట్‌ అన్నది ఓ జీవితకాల శిక్షగా మారనున్నట్టు క్యాటో ఇన్‌స్టిట్యూట్‌ రిపోర్ట్‌ చెబుతోంది. ప్రస్తుతం ఆ శాఖ దగ్గర ఉన్న అప్లికేషన్లను క్లియర్‌ చేయాలంటే ఎంత కాదనుకున్నా 134 సంవత్సరాలు పడుతుంది. సుమారు 4 లక్షల 24 వేల మంది గ్రీన్‌ కార్డు కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు విడిచే ప్రమాదం ఉందట! ఇందులో 90 శాతం మంది భారతీయులే ఉన్నట్టు క్యాటో ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక చెబుతోంది.

Updated On 6 Sep 2023 3:50 AM GMT
Ehatv

Ehatv

Next Story