హాలీవుడ్(Hollywood) నటి సమంత క్యాన్సర్‌ను(cancer) జయించలేకపోయింది. 28 ఏళ్ల వయసులోనే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయి. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ ఓడిపోయింది. ఈ నెల 14న ఆమె ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది.
హాలీవుడ్(Hollywood) నటి సమంత క్యాన్సర్‌ను(cancer) జయించలేకపోయింది. 28 ఏళ్ల వయసులోనే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయి. రెండున్నరేళ్లుగా అండాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ ఓడిపోయింది. ఈ నెల 14న ఆమె ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచింది. సమంత మరణంపై హాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండే తన కూతురు ఇలా అర్థాంతరంగా తమను విడిచి వెళ్లిపోతుందని అనుకోలేదని సమంత తండ్రి అన్నారు. ఆమెతో కాసేపు కలిసి మాట్లాడితే చాలు పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా మంది చెబుతుంటారని అన్నారు.
కూతురును తల్చుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమంత తమ అందరి జీవితాలను మార్చేసిందని ఆమె తల్లి అన్నారు.
పదేళ్ల వయసులోనే సమంత సినీరంగంలో అడుగుపెట్టింది. నటనను కెరీర్‌గా ఎంచుకుంది. 2005లో బిగ్‌గర్ల్‌లో జోసెఫిన్ పాత్రను పోషించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. 2022 అక్టోబర్‌లో మైఖేల్ నుట్సన్‌ను పెళ్లి చేసుకుంది. మే 1వ తేదీన నుట్సన్‌తో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. ఆ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె చిట్ట చివరి పోస్టు ఇదే కావడం గమనార్హం. భర్తతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూస్తుంటే అప్రయత్నంగానే కళ్లు చెమ్మగిల్లుతాయి.