సమైక్య పాలనలో బతుకమ్మ(Bathukamma) పండుగ నిరాదరణకు గురైన మాట వాస్తవం. ఒకానొక సందర్భంలో బతుకమ్మను టాంక్‌బండ్(Tank Bund) మీద ఆడటానికి కూడా అనుమతి లభించలేదు. కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు బతుకమ్మ దేశ వ్యాప్తమయ్యింది. తెలంగాణ సంస్కృతి(Telangana Culture) గొప్పతనం వాణిజ్య ప్రకటనల్లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు బాలీవుడ్(Bollywood) సినిమాలో కూడా బతుకమ్మ సంబరం చోటు దక్కింది.

Telangana Culture In Bollywood
సమైక్య పాలనలో బతుకమ్మ(Bathukamma) పండుగ నిరాదరణకు గురైన మాట వాస్తవం. ఒకానొక సందర్భంలో బతుకమ్మను టాంక్‌బండ్(Tank Bund) మీద ఆడటానికి కూడా అనుమతి లభించలేదు. కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు బతుకమ్మ దేశ వ్యాప్తమయ్యింది. తెలంగాణ సంస్కృతి(Telangana Culture) గొప్పతనం వాణిజ్య ప్రకటనల్లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు బాలీవుడ్(Bollywood) సినిమాలో కూడా బతుకమ్మ సంబరం చోటు దక్కింది. అది కూడా కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సినిమాలో! ఇక ఇప్పుడు ఉత్తరాది ప్రజలకు కూడా బతుకమ్మ గురించి తెలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ (Salman Khan) హీరోగా నటించిన కొత్త సినిమా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) రంజాన్ పండుగ(Ramjan Festival)ను పురస్కరించుకుని ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో బతుకమ్మ గొప్పతనాన్ని తెలిపే ఓ పాట ఉంది. ఆ పాటను ఈ మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. కేజీఎఫ్(KGF) ఫేమ్ రవి బస్రూర్(Ravi Basrur) చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. సల్మాన్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. తెలుగు పాటను హరిణి ఇవటూరి, కిన్నల్ రాజ్ రాస్తే హిందీ పాటను షబ్బీర్ అహ్మద్, రవి బస్రూర్ రాశారు. విక్టరీ వెంకటేశ్ ఓ ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) అన్నయ్య పాత్రలో వెంకటేశ్(Venkatesh) నటిస్తున్నారు. ఇవాళ విడుదలైన బతుకమ్మ వీడియో పాటలో పూజా డాన్స్ అద్భుతంగా ఉంది. ఈ పాటలో భూమిక కూడా కనిపిస్తారు. సినిమాలోని ఓ సందర్భంలో బతుకమ్మ పాట పెడితే బాగుంటుందని వెంకటేశ్ సలహా ఇచ్చారట. ఆ సలహాను సల్మాన్ పాటించారు. తెలంగాణ మహిళలకు ఈ పాటను అంకితం ఇస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాలోని ఓ పాటలో గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Global Star Ram Charan) కూడా కనిపిస్తారు.
