మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game changer) లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా(Pan India) రేంజ్ లో తెరకెక్కుతోంది ఈసినిమా.. పొలిటికల్ యాక్షన్(Political action drama) డ్రామాగా రూపొందుతున్న ఈసినిమాలో డ్యూయల్ రోల్(Dual Role) చేస్తున్నాడు రామ్ చరణ్. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు(Dil raju) పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) బుచ్చిబాబు(Buchibabu) కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. త్వరలో స్టార్ట్ కాబోతున్నసినిమాలో కావల్సిన యాక్టర్స్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game changer) లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా(Pan India) రేంజ్ లో తెరకెక్కుతోంది ఈసినిమా.. పొలిటికల్ యాక్షన్(Political action drama) డ్రామాగా రూపొందుతున్న ఈసినిమాలో డ్యూయల్ రోల్(Dual Role) చేస్తున్నాడు రామ్ చరణ్. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు(Dil raju) పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉండగా.. అవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇక కొన్నిరోజులుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. తన కూతురు, భార్యతో టైమ్ స్పెండ్ చేస్తున్నాడు రామ్ చరణ్.

తాజా సమాచారం ప్రకారం ఈ నెలలో గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. ఈ మూవీ షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి.. నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయబోతున్నాట చరణ్. నెక్ట్స్ సినిమాను ఉప్పెన(Upena) దర్శకుడు బుచ్చిబాబు సన(buchibabu sana) తో చేయబోతున్నాడు చరణ్. తన కెరీర్ 16వ సినిమా చేయనున్నారు చరణ్. మైత్రి మూవీ మేకర్స్(Mytri movie makers) సమర్పణలో వృద్ధి సినిమాస్(Vrudhi cinemas) బ్యాన‌ర్‌పై వెంక‌ట్ స‌తీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

వచ్చే ఏడాది మూవీ సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. అయితే ఈ మూవీలో స్టార్ యాక్టర్స్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడ బుచ్చిబాబు. అందులో కీలకమైన విలన్ రోల్ కోసం ప్రముఖ కోలీవుడ్ స్టార్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని(Vijay sethupathi) సంప్రదించిందట RC16 యూనిట్. ఆయన కూడా ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల లేటెస్ట్ టాక్. అయితే దీని పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం రావాల్సి ఉంది. కాగా ఈ మూవీని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పోర్ట్స్ డ్రామా మూవీగా పాన్ ఇండియన్ రేంజ్ లో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించనున్నారట. ఇక ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Updated On 9 July 2023 12:14 AM GMT
Ehatv

Ehatv

Next Story