వేణు యెల్దండి(Venu) దర్శకత్వంలో వచ్చిన బలగం(Balagam) సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వేణు యెల్దండి(Venu) దర్శకత్వంలో వచ్చిన బలగం(Balagam) సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబబంధాలను తెర మీద ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఈ సినిమాకు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు దక్కాయి. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను(Film fare) కూడా బలగం సంపాదించింది. బలంగం సినిమా దర్శకుడు, చిత్ర బృందాన్ని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ఎక్స్‌ వేదికగా ప్రశంసించారు. అవార్డులను దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు వేణు యెల్దండిని అభినందించారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిలమని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాధించే ఇది తొలిమెట్టు అని చెప్పారు.



Eha Tv

Eha Tv

Next Story