బ్రో(BRO) సినిమా సక్సెస్..కలెక్షన్లు ప్రవాహంతో మూవీ టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాురు టీమ్. అటు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇటు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇద్దరు దిల్ ఖుష్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

బ్రో(BRO) సినిమా సక్సెస్..కలెక్షన్లు ప్రవాహంతో మూవీ టీమ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాురు టీమ్. అటు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఇటు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇద్దరు దిల్ ఖుష్ అవుతున్నారు. మెగా ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈమూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిఫరెంట్ గెటప్ లో కనిపించిన సినిమా బ్రో. సాయి ధరమ్ తేజ్ హీరోగా.. పవర్ స్టార్, సుప్రీం హీరో కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రో. ఈ మల్టీ స్టారర్ మూవీని తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని డైరెక్ట్ చేశారు. తమిళంలో సముద్రఖని డైరెక్ట్ చేసి నటించిన వినోదయ సీత్తం సినిమాకు తెలుగు రీమేక్ గా బ్రో మూవీ తెరకెక్కింది. తెలుగులో మాత్రం డైరెక్ట్ చేయగా.. స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. కాగా 28 జులైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

ఇక తాజాగా ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ చేయడం కోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో డిజిటల్ స్ట్రీమింగ్(Digital Streaming) పార్ట్‌నర్ ఎవరనేది రివీల్ చేస్తారు కాబట్టి అందులో ఎలాంటి సస్పెన్స్ ఉండదు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది క్లారిటీ ఉండదు. కొన్ని సినిమాలు మాత్రం కామ్ గా చప్పుడు లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.

ఇక బ్రో విషయానికొస్తే.. మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్(Netflix) సంస్థ దక్కించుకుంది. పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ముహూర్తం కూడా పెట్టారట టీమ్. అయితే ఇవన్నీ షికారు వర్తలే.. మరి అసలు విషయం టీమ్ అనౌన్స్ చేస్తే కాని తెలియదు. ఇదే నిజం అయితే.. థియేటర్లలో రిలీజ్ అయిన 5 వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తోంది మూవీ.

మొదటి నుంచి బ్రో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా అద్భుతంగా ఉండటంతో మెగా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో.. వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. . మొదటి నుంచే ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Updated On 29 July 2023 7:35 AM GMT
Ehatv

Ehatv

Next Story