ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Prdaesh) కైసర్‌గంజ్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ(BJP) అభ్యర్థి కరణ్‌భూషణ్ సింగ్(Karan Bhushan Singh) కాన్వాయ్‌లోని(Convoy) ఫార్చ్యూనర్ కారు (UP 32 HW 1800) అత్యంత వేగంగా వెళ్లి ఓ బైక్‌ను(Bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని గోండా దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పైన ఉన్న రెహాన్, షెహజాద్ ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Prdaesh) కైసర్‌గంజ్ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ(BJP) అభ్యర్థి కరణ్‌భూషణ్ సింగ్(Karan Bhushan Singh) కాన్వాయ్‌లోని(Convoy) ఫార్చ్యూనర్ కారు (UP 32 HW 1800) అత్యంత వేగంగా వెళ్లి ఓ బైక్‌ను(Bike) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. హుజూర్‌పూర్-బహ్రైచ్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని గోండా దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పైన ఉన్న రెహాన్, షెహజాద్ ఇద్దరూ స్పాట్‌లోనే చనిపోయారు. మరో ఇద్దరు పాదచారులు గాయపడ్డారు. కారుపై పోలీస్ ఎస్కార్ట్ అని రాసి ఉండటం గమనార్హం. ఈ ప్రమాదంలో ఫార్చ్యూనర్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోకి ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకోవడంతో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత వారు కారు అక్కడే వదిలేసి పారిపయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడినవారిని స్థానికంగా ఉన్న సీహెచ్‌సీకి తరలించి వైద్య చికిత్స అందించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పడు కరణ్ భూషణ్ కాన్వాయ్ ఉన్నాడా? లేదా? అన్నది తెలియలేదు. ప్రమాదం తర్వాత ప్రజలు ఆగ్రహంతో సీహెచ్‌సీని ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇంతకు ముందు కూడా కరణ్ భూషణ్ ఇలాగే వ్యవహరించాడు. ఉత్తరప్రదేశ్‌లో అతి వేగంగా కారు నడిపి రైతుల మీదకు తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా పలువురు రైతులు మృతిచెందారు. ఈ ఘటన అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.