వైఎస్‌ వివేకా హ‌త్య‌ కేసులో అజయ్ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఫైనల్ చార్జ్‌షీట్‌లో తన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇచ్చిన‌ వాంగ్మూలాన్ని కాకుండా చార్జిషీట్‌లో మరో స్టేట్‌మెంట్‌ను సీబీఐ చేర్చిందనీ అజయ్ కల్లం తన పిటిషన్ లో పేర్కొన్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌(Telangana CM KCR)ను హ‌స్య‌న‌టుడు బ్ర‌హ్మానందం(Brahmanandam) కుటుంబ స‌మేతంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో జరుగనున్న తన చిన్న‌ కుమారుడు సిద్దార్ధ్‌(Siddharth) వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ఈ మేర‌కు శనివారం నాడు ప్రగతి భవన్(Pragathi Bhavan) లో ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) దంప‌తుల‌ను కుటుంబ సమేతంగా కలిసి.. వివాహ ఆహ్వాన పత్రిక(Wedding Invitations) అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రహ్మానందం వెంట సీఎంను క‌లిసిన వారిలో ఆయ‌న పెద్ద కుమారుడు గౌత‌మ్ కూడా ఉన్నారు.

బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట(Aha na Pellanta) సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. వివిధ భాషలలో ఆయ‌న‌ 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. 2009లో భారత ప్రభుత్వం ఆయ‌న‌ను పద్మశ్రీ(Padma Sri Award) పురస్కారంతో గౌర‌వించింది. ఉత్తమ హాస్య నటుడిగా బ్రహ్మానందం ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.

బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌత‌మ్(Goutham).. 2004 సంవత్సరం కె.సుచిత్రా చంద్రబోస్(Suchithra Chandrabose) దర్శకత్వం వహించిన పల్లకిలో పెళ్లికూతురు(Pallaki lo Pelli kuthuru) సినిమాతో అరంగేట్రం చేసాడు. ఆ తర్వాత 2011లో వచ్చిన వారెవా సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. బసంతి (2014), చారుశీల (2016), మను (2018) లాంటి చిత్రాలతో ఆయన గుర్తింపు పొందాడు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్ధార్థ్(Siddharth) సినిమాల‌కు దూరంగా ఉన్నాడు.

Updated On 29 July 2023 7:58 PM GMT
Yagnik

Yagnik

Next Story