కామెడీ కింగ్ బ్రహ్మానందం గతంలో చేసిన ప్రతీ పాత్రా సినిమా విజయానికి ఎంతగానో కారణమైంది. ఆయన చూసినన్ని మైల్ స్టోన్స్ మరే ఇతర స్టార్ కమెడియన్ చూడలేదంటే అతశయోక్తి కానేకాదు. వందలాది సినిమాలు, లెక్కలేనన్ని క్యారెక్టర్స్...పుంఖానుపుంఖాలుగా హిట్స్ ఇదీ టూకీగా బ్రహ్మానందం సినీ జీవితం. కానీ ప్రతీ దర్శకుడు బ్రహ్మానందంకి లభించిన వీర ఫేన్ ఫాలోయింగ్‌ని అడ్వాంటేజ్ తీసుకుని ఒకే తరహా పాత్రలను సృష్టించినా కూడా ఆడియన్స్ విసిగిపోకుండా ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూనేవచ్చారు. అదీ బ్రహ్మానందం స్సెషాలిటీ.
కామెడీ కింగ్ బ్రహ్మానందం గతంలో చేసిన ప్రతీ పాత్రా సినిమా విజయానికి ఎంతగానో కారణమైంది. ఆయన చూసినన్ని మైల్ స్టోన్స్ మరే ఇతర స్టార్ కమెడియన్ చూడలేదంటే అతశయోక్తి కానేకాదు. వందలాది సినిమాలు, లెక్కలేనన్ని క్యారెక్టర్స్...పుంఖానుపుంఖాలుగా హిట్స్ ఇదీ టూకీగా బ్రహ్మానందం సినీ జీవితం. కానీ ప్రతీ దర్శకుడు బ్రహ్మానందంకి లభించిన వీర ఫేన్ ఫాలోయింగ్‌ని అడ్వాంటేజ్ తీసుకుని ఒకే తరహా పాత్రలను సృష్టించినా కూడా ఆడియన్స్ విసిగిపోకుండా ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తూనేవచ్చారు. అదీ బ్రహ్మానందం స్సెషాలిటీ. హీరోతో పాటు ప్రధానమైన పాత్రలను కైవశం చేసుకుని తనూ దాదాపుగా హీరోయిజం రేంజ్‌కి రీచ్ అయ్యారు అవర్ డియర్ బ్రహ్మీ. మెగాస్టార్ చిరంజీవి లాటి బిగ్గెస్ట్ స్టార్ కూడా బావగగారు బాగున్నారా చిత్రం విడుదలై రికార్డులు క్రాస్ చేస్తున్న సమయంలో తను చేస్తున్న చూడాలని ఉంది సెట్‌కి బ్రహ్మానందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించి, పూలబోకేతో, శాలువతో వ్యక్తిగతంగా సత్కరించారు. అదీ బ్రహ్మానందం స్పెషాల్టీ.
అయితే ఇటీవల బ్రహ్మానందం తన స్పీడు తగ్గించారు. మంచి క్యారెక్టర్ కాకపోతే, మూసపాత్రలయితే చేయనని తెగేసి చెప్పి మరీ స్టీరియోటైపు క్యారెక్టర్స్‌కి దూరంగా ఉంటున్నారు. ఈ కారణంగానే మన లవలీ బ్రహ్మీని అందుకోలేకపోతున్నాం. కరెక్టుగా ఇద టైంలో...క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్న కృష్ణవంశీ బ్రహ్మీని తట్లిలేపారు. కొత్త క్యారెక్టర్‌తో రెచ్చగొట్టారు. అదే రంగమార్తాండ చిత్రంలో పాత్ర. హెవీడ్రామా చిత్రం ఇది. గుండెలు పిండేసే కథాకథనాలతో రంగమార్తాండ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అటువంటి చిత్రంలో ప్రకాష్‌రాజ్ లాటి విలక్షణ నటుడు, రమ్యకృష్ణలాటి వెర్సటైల్ యాక్ర్రస్‌లతో పాటు బ్రహ్మానందం అవుట్ అండ్ అవుట్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. కామెడీకాదు, అస్సలా టచ్ కూడా లేదు. లేకపోగా టోటల్ హెవీగా నడుస్తూ, బ్రహ్మానందం నుంచి ఏ క్షణంలోనూ ఆశించని, ఊహించని మెలోడ్రామా పాత్ర....చాలా ఎమోషనల్ డైలాగులు. బ్రహ్మానందం చేసిన పాత్రలన్నిటికీ ఇది పూర్తిగా చాలా దూరమైన పాత్ర. కొన్ని సీన్స్‌లోనైతే, ప్రకాష్‌రాజ్‌లాటి ఆర్టిస్ట్ కూడా బ్రహ్మానందం ముందు తేలిపోయాడని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు.
బ్రహ్మానందంలో ఇంత గ్రేట్ ఎమోషనల్ ఆర్టిస్ట్ ఉన్నాడా అనే సందేహాం ప్రేక్షకులను వెంటాడుతుంది. ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఎమోషన్...ఒక్కొక్క సీను ఒక్కొక్క సినిమా అంత భారీగా అనిపించింది బ్రహ్మానందం నటిస్లుంటే. అటువంటి ఎమోషనల్ క్యారెక్టర్‌ని సైతం చీల్చిచెండాడి, చెడుగుడు అడేశారు బ్రహ్మానందం. ఆయనని అమితంగా అభిమానించే వారందరికీ రంగమార్తాండ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఒక ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. ఒక మరపురాని అనుభవం.