నా అకౌంట్‌ హ్యాకైంది

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSR Congress Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagana Moham Reddy) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన ఓ పోస్టుకు సినీ నటుడు బ్రహ్మాజీ కూడా రియాక్టయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారనంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఇంకా ఆదుకోవడం లేదని, వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్‌ చేసిన ట్వీట్‌కు బ్రహ్మాజీ కౌంటర్‌ ఇచ్చారు. 'మీరు కరెక్ట్ సార్.. వాళ్ళు చెయ్యలేరు.. ఇకనుంచి మనం చేద్దాం.. ఫస్ట్‌ మనం రూ.1000 కోట్లు విడుదల చేద్దాం. మన వైకాపా కేడర్‌ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం .. మనకి జనాలు ముఖ్యం.. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం సార్.. జై జగన్‌ అన్నా' అంటూ పోస్ట్‌ పెట్టారు. అయితే ఈ ట్వీట్‌తో బ్రహ్మాజీ మరోసారి ట్రోల్ అయ్యారు. దెబ్బకు ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు. చేస్తే చేశారు కానీ దాన్ని కవర్‌ చేసుకోవాలనుకున్నారు. ఆ పోస్ట్ తాను చేయలేదని ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు. ‘నా ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాని ఎవరో హ్యాక్‌ చేశారు. నాకు ఆ ట్వీట్‌కు సంబంధం లేదు. ఫిర్యాదు కూడా చేశాం’ అని పోస్ట్ పెట్టారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కూడా నెటిజన్లు ఆడుకుంటున్నారు. వైసీసీపి భయపడ్డావా? లేక వైసీపీ కార్యకర్తల ట్రోలింగ్కు భయపడ్డావా? అని ఒకరు అడితే ఈ రాజకీయాలు నీకెందుకన్నా.. చక్కగా సినిమాలు చేసుకోక అని మరొకరు కామెంట్ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story