అనుకున్నట్టుగానే పుష్ప 2 సినిమాపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఓ వర్గం పనిగట్టుకుని పుష్ప 2పై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నది.

అనుకున్నట్టుగానే పుష్ప 2 సినిమాపై ట్రోల్స్‌ మొదలయ్యాయి. ఓ వర్గం పనిగట్టుకుని పుష్ప 2పై నెగటివ్‌ ప్రచారం చేస్తున్నది. అక్కడికేదో పుష్ప2 సినిమాతోనే టికెట్‌ రేట్లు(Ticket Price Hike) పెంచడం మొదలయినట్టుగా సోషల్‌ మీడియాలో వార్తలు రాస్తున్నది. పెద్ద సినిమా వస్తున్నదంటే టికెట్‌ రేట్లు పెంచడం సర్వ సాధారణమైన విషయంగా మారింది. కొన్నేళ్లుగా ఇది జరుగుతూ వస్తున్నది. మరి పుష్ప 2 సినిమానే ఎందుకు ఆడిపోసుకుంటున్నారు? ఇందుతో మతలబు ఏమిటి? బాహుబలి, కల్కి వంటి పాన్‌ ఇండియా సినిమాలను భారీ బడ్డెట్‌తో తీశారు కాబట్టి వాటి టికెట్‌ రేట్లు పెంచుకున్నారంటే అర్థం ఉంది. పుష్ప2(Pushpa 2) సినిమాకు ఎందుకు పెంచాలి? అన్నది వాళ్ల లాజిక్‌. అందుకే బాయ్‌కాట్‌ పుష్ప 2 హాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ చేస్తున్నారు. టికెట్‌ రేట్లను పెంచుకోవడన్నది ఇటీవల ఓ ఫ్యాషన్గా మారింది. ప్రభుత్వాలు కూడా గుడ్డిగా అనుమతులు ఇచ్చేస్తున్నాయి. ఈ ప్రత్యేక మినహాయింపును దుర్వినియోగం చేస్తున్నారు కొందరు. పుష్ప 2 మేకర్స్‌ ఈ దుర్వినియోగాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారన్నది కొందరి వాదన. టికెట్ల రేట్ల పెంపు విషయంపై జీవో ఇచ్చిన తెలంగాణ సర్కార్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. విడుదలైన వారం రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకుంటే ఫర్వాలేదు. కొన్ని సినిమాలకు పది రోజుల పెంపును కూడా ఇచ్చారు. పుష్ప 2 సినిమాకు ఏకంగా 19 రోజుల పాటు టికెట్‌ రేట్లపై వివిధ స్థాయిలో పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ సినిమాకు ఇలా జరగలేదు. వాస్తవం చెప్పాలంటే పుష్ప2 సినిమాలకు పెద్దగా గ్రాఫిక్స్‌ అవసరం లేదు. భారీ సెట్స్‌ వేయాల్సిన పని లేదు. కాకపోతే సినిమాను మూడేళ్ల పాటు తీసి ఆ భారాన్ని ప్రేక్షకుల నెత్తిన రుద్దాలనుకోవడం సమంజసంగా లేదంటున్నారు నిర్మాతలు. ఈ కారణంగా నెటిజన్లు మండిపడుతున్నారు. పుష్ప 2 సినిమాను ఎవరూ చూడవద్దని సూచిస్తున్నారు.'ఎవడబ్బ సొమ్మని టికెట్ రేట్లను ఇష్టమొచ్చినట్టు పెంచుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధర పెంచడం చేత కాదు కానీ, సినిమాలకు మాత్రం పెంచేస్తారు'అని అంటూ ఓ ప్రేక్షకుడు మండిపడ్డాడు.'అంత బడ్జెట్ పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు? బాలీవుడ్ కి పట్టిన గతే టాలీవుడ్ కి కూడా పడుతుంది. ఇంత ధరలు పెట్టి చూసే బదులు సంవత్సరం మొత్తం OTT ప్లానే వచ్చేస్తుంది కదా! ఒకరిద్దరి లాభాల కోసం లక్షల మంది ప్రజలను హింసించడం నేరం' అని మరొక నెటిజన్‌ రాసుకొచ్చారు.

ehatv

ehatv

Next Story