✕
చలనచిత్రపరివ్రమ అన్నది ఎంత కళాత్మకమైనదైనా, కమర్షియల్ చిత్రాల భారీ విజయాలతోనే అది బతికి బట్ట కట్టేది. అంటే సినిమా పరిశ్రమకి ప్రాణం పోసేది, జీవం ప్రసాదించేది ముమ్మాటికీ కమర్షియల్ సినిమాయే తప్ప కళాత్మక చిత్రాలు కానేకావు. కళాత్మక చిత్రాలు మెచ్చుకోవడానికి, అనుభూతిని అందివ్వడానికి ఉపయోగపడతాయేమో గానీ, కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినట్టు విగరుని, పొగురుని మాత్రం కట్టబెట్టలేవు.

x
boyati srinu
-
- చలనచిత్రపరివ్రమ అన్నది ఎంత కళాత్మకమైనదైనా, కమర్షియల్ చిత్రాల భారీ విజయాలతోనే అది బతికి బట్ట కట్టేది. అంటే సినిమా పరిశ్రమకి ప్రాణం పోసేది, జీవం ప్రసాదించేది ముమ్మాటికీ కమర్షియల్ సినిమాయే తప్ప కళాత్మక చిత్రాలు కానేకావు. కళాత్మక చిత్రాలు మెచ్చుకోవడానికి, అనుభూతిని అందివ్వడానికి ఉపయోగపడతాయేమో గానీ, కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినట్టు విగరుని, పొగురుని మాత్రం కట్టబెట్టలేవు.
-
- అటువంటి భారీవిజయాల ద్వారా తెలుగు సినిమా ఆర్ధికవైభవాన్ని నిలుపుతూ, హైరేంజ్ హీరోలకు అంతకన్నా హైరేంజ్ హెట్స్ని అందించి, కమర్షియల్ సినీ ప్రపంచం గర్వపడే స్థాయిలో సంచలనాలను సృష్టించిన నేటి తరం దర్శకులలో బోయపాటి శ్రీను చాలా పెద్ద స్థానాన్నే సాధించాడని చెబితే అదెంత మాత్రం కూడా అతిశయోక్తి కానేకాదు. అనేక చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన అపారమైన అనుభవంతో దర్శకుడిగా ఎదిగిన బోయపాటిలో దార్శినిక పరిపక్వత, నైపుణ్యం రెండింటికి రెండూ కూడా పుష్కలంగా ఉన్నకారణంగా బోయపాటి అతి తక్కువ కాలంలోనే అగ్రశ్రేణిని చేరుకోగలిగాడు.
-
- రవితేజతో చేసిన తొలిచిత్రం భద్రతోనే దర్శకుడిగా సముజ్వలమైన విజయాన్ని సాధించి, తారాపథంలోకి దూసుకుపోయిన బోయపాటి తరువాతి రోజులలో మరి వెనక్కి తిరిగి చూడకుండా, ప్రతి మలుపునూ సొంతం చేసుకుని, ఆ మలుపునే తన గెలుపుగా మలచుకుని చిత్రపరిశ్రమకి తిరుగులేని రీతిలో ఒక ఆశగా ఎదిగాడు. సింహా సినిమాతో బాలకృష్ణ మార్క్ సినిమాల స్టాంప్‌ని ఇంట్రడ్యూస్ చేసిన రికార్డ్ మాత్రం ఎప్పటికీ బోయపాటికే చెందుతుంది.
-
- బోయపాటికి ముందు కూడా బి. గోపాల్ లాటి దర్శకులు భారీ సంచలన విజయాలను రూపొందించి, నందమూరి ఫ్యాన్స్‌కి పండగ చేసినా, ఆ రోజులు పూర్తిగా వేరు. సినిమాల ధోరణలు, ట్రెండ్స్ అండ్ టైమ్స్ ఆద్యంతం మారిపోయి అగ్రశ్రేణి కథానాయకుల కెరీర్లు ప్రశ్నార్థకమవుతున్న సంధియుగంలో బోయసాటి వచ్చి అడ్డు పడ్డాడు. యంగ్ హీరోల హిట్స్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టైంలో బోయపాటి సింహా లాటి రోరింగ్ హిట్ ఇవ్వడమన్నది మాత్రం తిరుగులేని ఎఛీవ్మెంట్గానే ఒప్పుకుతీరాలి.
-
- ఆ పోకడలోనే ప్రేక్షకులు, నందమూరి అభిమానులు, సినిమా పరిశ్రమ అంతా ఏకమైన ఎదురుచూస్తున్నప్పుడు మళ్ళీ చెప్పి మరీ లెజెండ్ కొట్టి చూపించాడు బోయపాటి. మొన్నీ మధ్యన వచ్చి ఇండియా వైడ్ ఊపేసిన అఖండ చిత్రం గురించి ఎన్ని మాటలు రాసినా సరే తక్కువే అవుతుంది. కరోనా ఓ వైపున. టెక్కెట్ రేట్ల సంక్షోభం మరో పక్కన. ధియేటర్లే వెలవెలబోతున్న ఆయోమయస్థితి. అటువంటి కరడుగట్టిన పరిస్థితిని కూడా అవలీలగా ఛేదించి, సంచలనం సృష్టించడం ఆషామాషీ కాదు.
-
- అదోక ఫీట్! స్టైలిష్ స్టార్‌గా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అల్లు అర్జున్‌కి సరైనోడు లాటి హిట్ ఇచ్చి, తన కెపాసిటీని మరోసారి మరోసారి నిరూపించుకున్నాడు బోయపాటి. ఇప్పుడు రాపోతో సినిమా చేస్తున్నాడంటే తప్పనిసరిగా రామ్‌కి ఓ పెద్ద హిట్ రిజిస్టర్ అయిందని ముందస్తుగానే చెప్పొచ్చు.
-
- ఓ డైరెక్టర్ కెపాసిటీ అన్నది డైరెక్టర్ ఎనర్జీ లెవెల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎనర్జీ విషయంలో బోయపాటికి ఎప్పటికీ తిరుగులేదు. సినిమా స్క్రిప్ట్ జరుగుతున్నప్పుడే తను తీయబోయే షాట్స్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునే దర్శకుడి విజన్‌కి ఎదురేముంటుంది? అదే బోయపాటి ట్రెండ్! అదే బోయపాటి బ్రాండ్!! ఈ రోజు బోయపాటి శ్రీను పుట్టినరోజు సందర్భంగా ఈహా టీవీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్....బోయపాటి.....

Ehatv
Next Story