టాలీవుడ్ ఊరమాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను(Booyapati Sreenu) సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు పవర్ స్టార్ తో సినిమా ఎందుకు చేయలేదు కూడా క్లారిటీ ఇచ్చారు బోయపాటి.

Boyapati Sreenu-Pawan Kalyan
టాలీవుడ్ ఊరమాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను(Booyapati Sreenu) సంచలన కామెంట్స్ చేశారు. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు పవర్ స్టార్ తో సినిమా ఎందుకు చేయలేదు కూడా క్లారిటీ ఇచ్చారు బోయపాటి.
టాలీవుడ్ లో ఊరమాస్ సినిమాల దర్శకుడు ఎవరు అంటే అందరు మొదట చెప్పే పేరు బోయపాటి శ్రీను. మరీ ముఖ్యంగా నందమూరి నట సింహం బాలకృష్ణతో ఆయన చేసిన సినిమాలు సంచలనాలనే చెప్పాలి. ఇక టాలీవుడ్ ఓ మాస్ ఇమేజ్ కోసం ఆరాటపడే ఏ హీరో అయినా.. బోయపాటితో సినిమా చేయాలి అని ఆరటపడుతుంటారు. రీసెంట్ గా రామ్ పోతినేనితో స్కంధ మూవీ చేశాడు బోయపాటి. కాని ఈసినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. యావరేజ్ మూవీగా మిగిలిపోయింది.
ఇక తాజాగా బోయపాటి శ్రీను పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మొదటి సారి ఆయన పవన్ గురించి స్పందించడంతో అంతటా ఇది హైలెట్ అవుతుంది. బోయపాటి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కి ఫిల్టర్ లేదని.. ఏది అనుకుంటే అది చేసేస్తారని అన్నారు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ, ఎక్కడ నిజాయితీ, న్యాయం ఉంటే అక్కడ ఆయన నిలబడతారని పవన్‌కి హ్యాట్సాఫ్ అని అన్నారు బోయపాటి. బోయపాటి వ్యాఖ్యలతో అటు పవర్ స్టార్ ఫ్యాన్స్.. ఇటు నందమూరి ప్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ - బోయపాటి కాంబినేషన్ సినిమా ఇంత వరకూ ఎందుకు రాలేదని ప్రశ్న ఎదరుయ్యింది మాస్ దర్శకుడికి. చాలా మంది మనసులో ఉన్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు కూడా బోయపాటి సమాధానం చెప్పారు. తను హైజానర్‌లో సినిమా తీయాలని అనుకుంటానని అందువల్లే పవన్ ముందుకు రారని చెప్పారు బోయపాటి. పొలిటికల్‌గా పవన్ ఎంగేజ్ అయి ఉండటం వల్ల అన్ని రోజుల కాల్షీట్లు పవన్ ఇచ్చే అవకాశం లేదు.. ఉండకపోవచ్చని అన్నారు బోయపాటి. అంతే కాదు పవర్ స్టార్ ఒకవేళ టైమ్ ఇస్తే.. తప్పకుండా భవిష్యత్తులో అద్భతమైన సినిమా సినిమా తీస్తానని స్పష్టం చేసారు బోయపాటి
