అతిలోకసుందరి దివికేగి అప్పుడే అయిదేళ్లు గడిచిపోయాయి. అందాల నటి ఇంకా మనమధ్య ఉన్నట్టుగానే ఉంది. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి(Sridevi) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే చాలా మంది శ్రీదేవి భర్త బోనీ కపూర్‌పై(Boney Kapoor) సందేహాలు వ్యక్తం చేశారు.
అతిలోకసుందరి దివికేగి అప్పుడే అయిదేళ్లు గడిచిపోయాయి. అందాల నటి ఇంకా మనమధ్య ఉన్నట్టుగానే ఉంది. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో శ్రీదేవి(Sridevi) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే చాలా మంది శ్రీదేవి భర్త బోనీ కపూర్‌పై(Boney Kapoor) సందేహాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా దుబాయ్ పోలీసులు చాలా అనుమానపడ్డారు. అయితే ఇప్పటి వరకు బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి మరణంపై(Sridevi Death) రియాక్టవ్వలేదు. ఇన్నాళ్ల తర్వాత స్పందించారు.
శ్రీదేవి మరణంపై తనకున్న అనుమానాలేమిటో చెప్పుకొచ్చారు. నాజూకుగా కనిపించడం కోసం శ్రీదేవి స్ట్రిక్ట్ డైట్(Strict Diet) ఫాలో అయ్యేదని, కఠినమైన ఆహార నియమాలు పాటించేదని బోనీ కపూర్ అన్నారు. ఉప్పు, కారం లేని ఆహారం తీసుకునేదట! అది కూడా చాలా తక్కువ మోతాదులో! ఉప్పు లేకుండా తినకూడదని డాక్టర్లు వారించినా శ్రీదేవి పట్టించుకోలేదని బోనీకపూర్ చెప్పారు. 'ఆమె తరచుగా ఆకలితో అలమటించేది. కొన్నిసార్లు ఆమె కళ్లు తిరిగి పడిపోయేది. తను స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుందనే విషయం నాకు పెళ్లయ్యాకే తెలిసింది.
అందంగా కనిపించడం కోసం, మంచి ఆకృతి కోసం ఆమె శరీరాన్ని కష్టపెట్టేది. ఆమెకు లో బీపీ సమస్యలు ఉన్నాయ. ఆహార నియమాలను సడలించాలని డాక్టర్లు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆమె పట్టించుకోలేదు' అని బోనీ కపూర్ తెలిపారు. 'శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మరణానంతరం దుబాయ్ పోలీసులు నన్ను 24 గంటలపాటు విచారించారు. లై డిటెక్టర్ పరీక్షలూ చేశారు. భారతీయ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని చివరకు వారు నిర్ధారించారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత నటుడు నాగార్జున నన్ను కలిశారు. క్రాష్ డైట్(Crash Diet) కారణంగా శ్రీదేవి ఓసారి సెట్‌లో సృహతప్పి పడిపోయిందని, ఆ సమయంలో ఆమె పన్ను కూడా విరిగిందని చెప్పారు’’ అని బోనీకపూర్ తెలిపారు. 2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు.