యామాజోరు మీద ఉన్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).వరుస విజయాలతో ఏమాత్రం తగ్గడంలేదు. సినిమా మీద సినిమా సైన్ చేస్తున్నాడు. తాజాగా సిద్దు కొత్త సినిమా కమిట్ అయినట్టుతెలుస్తోంది.

యామాజోరు మీద ఉన్నాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda).వరుస విజయాలతో ఏమాత్రం తగ్గడంలేదు. సినిమా మీద సినిమా సైన్ చేస్తున్నాడు. తాజాగా సిద్దు కొత్త సినిమా కమిట్ అయినట్టుతెలుస్తోంది.

జోరుమీద ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ. జూనియర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి.. హీరోగా ఎదిగాడు. జోష్‌ సినిమాలో చిన్న పాత్ర చేసిన సిద్దు ఆతరువాత ఆరేంజ్ లో కాస్త రిజిస్టర్ అయ్యే పాత్రలో కనిపించాడు..ఆతరువాత ఆయన చేసిన సినిమాలన్నీ పెద్దగా ఫలించలేదు. కాని రచయితగా మారి సిద్దు చేసిన గుంటూరు టాకీస్(Guntur talkies) మాత్రం గట్టిగా పేలింది. కాని అది అడల్ట్ మూవీ కావడంతో ఈసినిమా ద్వారా సిద్దుకంటే కూడా.. రష్మీకే(Rashmi)ఎక్కువగా క్రేజ్ వచ్చింది. ఇక ఆతరువాత సిద్దు లాక్ డౌన్ లో చేసిన కృష్ణ అండ్‌ హిస్ లీలా(Krishna And His Leela) మాత్రం కాస్త క్రేజ్‌ తెచ్చిపెట్టింది.

ఈ సినిమాకు కూడా రైటర్‌ ఆయనే. ఈ సినిమా తర్వాత జనాలకు సిద్దూ పేరు బాగానే రిజస్టర్‌ అయింది. ఆ తర్వాత వచ్చిన మా వింత గాధ వినుమా కూడా ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. ఇక గతేడాది వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) మాత్రం సిద్దూకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. పద్నాలుగేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న రాని గుర్తింపు డీజే టిల్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో మాములు క్రేజ్‌ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఇక ఇదిలా ఉంటే సిద్దూ తన తదుపరి సినిమా ఎవరితోనా అన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సీక్వెల్ తరువాత మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. సిద్దుకు ఆరెంజ్ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన భాస్కర్(Bhaskar) డరెక్షన్ లో.. ఆయన హీరోగా సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సిద్దూ జొన్నలగడ్డ దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుఫిక్స్ అయినట్టే అని అంటున్నారు. ఇక ఈ మూవీ పూజా శర్మణి కూడా ఆగస్టు 10న జరపబోతున్నారట. ఈ సినిమాకు హ్యారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చుతున్నట్లు టాలీవుడ్ టాక్.

ఇక చిరంజీవి-కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకక్కనున్న ప్రాజెక్ట్‌లో కూడా సిద్దూ సెకండ్ హీరోగా నటిస్తున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తాజాగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది. సిద్దూ పాత్రను శర్వా రీ ప్లేస్‌ చేస్తాడని ఇన్‌సైడ్‌. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే చిత్రబృందం నుంచి అఫిషియాల్‌ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Updated On 8 Aug 2023 11:52 PM GMT
Ehatv

Ehatv

Next Story