బాలీవుడ్(Bollywood) లో హీరోగా.. మంచి సినిమాలతో అలరించాడు విద్యుత్ జామ్వాల్. ఇటు సౌత్ లో విలన్ గా నటిస్తూ.. ఫ్యాన్స్ ను సాధించుకున్నారు. ఫిట్ నెస్(Fitness) విషయంలో ఎప్పుడూ ముందుండే విద్యుత్ జమ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్ నెస్, హ్యాండ్సమ్ నెస్ లో స్టార్ హీరోలకు కూడా పోటీ ఇవ్వగల నటుడు. కాని హీరోగా పెద్దగా క్లిక్ అవ్వలేదు కాని.. విలన్ గా మాత్రం సౌత్ లో చాలా సినిమాలు చేశాడు. టోన్డ్ బాడీతో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు విద్యుత్.

బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్(Vidyut Jammwal) షాక్ ఇచ్చాడు. ఒంటి మీద కనీసం నూలు పోగు కూడా లేకుండా హిమాలయాల్లో(Himalaya) తిరుగుతున్నారు. ఇంతకీ ఈ హీరో ఇక్కడ ఏం చేస్తున్నట్లు?

బాలీవుడ్(Bollywood) లో హీరోగా.. మంచి సినిమాలతో అలరించాడు విద్యుత్ జామ్వాల్. ఇటు సౌత్ లో విలన్ గా నటిస్తూ.. ఫ్యాన్స్ ను సాధించుకున్నారు. ఫిట్ నెస్(Fitness) విషయంలో ఎప్పుడూ ముందుండే విద్యుత్ జమ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిట్ నెస్, హ్యాండ్సమ్ నెస్ లో స్టార్ హీరోలకు కూడా పోటీ ఇవ్వగల నటుడు. కాని హీరోగా పెద్దగా క్లిక్ అవ్వలేదు కాని.. విలన్ గా మాత్రం సౌత్ లో చాలా సినిమాలు చేశాడు. టోన్డ్ బాడీతో అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు విద్యుత్.

ఈక్రమంలో ఈ నటుడు సడెన్ గా అందరికి షాక్ ఇచ్చాడు. విద్యుత్ జామ్వాల్ కు నేచర్(Nature) అంటే ఇష్టం. నేచర్ లో తిరగడం ..ప్రకృతీని ఆస్వాదించడం అంటే ఇంకా ఇష్టం. సినిమాలు.. షూటింగ్స్ లేుకుంటే ఆయన ఎక్కవగా కొండలు కోనలు తిరుగుతుంటారు. నచ్చిన చోటకు వెళ్లడం.. సేదతీరడం చాలా ఇష్టం. ఇక తాజాగా హిమాలయాల పర్యటనలో ఉన్నాడు స్టార్ నటుడు. అక్కడ చిక్కటి చలికాలం.. గడ్డ కట్టించే చలిలో కూడా.. ఒంటిపే బట్టలు(Nude) లేకుండా సేదదీరుతున్నాడు.

నూలు పోగుకూడా లేకుండా పెయిర్ బాడీతో హిమాలయా అడవుల్లో తిరుగుతున్నాడు. అక్కడే వండుకునితింటూ.. సరదాగా గడుపుతున్నాడు. ఈ ఫోటోలు విద్యుత్ తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అంతా షాక్ అవుతున్నారు కూడా.

తాను దైవ నివాసంలో తను ఉన్నానని.. ప్రతి సంవత్సరం 7-10 రోజులు హిమాలయాల్లో గడపడం తన జీవితంలో భాగమైందని’ విద్యుత్ జమ్వాల్ తన పోస్టులో చెప్పారు. ‘విలాసవంతమైన జీవితం నుండి అరణ్యానికి వచ్చినపుడు ఒంటరితనంలో తన గురించి తాను తెలుసుకునే అవకాశం దొరికిందని.. ప్రకృతి నిశ్శబ్దంలో తనను తాను తెలుసుకుంటానని’ రాసుకొచ్చారు. ‘కొద్దిరోజుల తర్వాత కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఇంటికి తిరిగి వస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు విద్యుత్.

Updated On 12 Dec 2023 7:44 AM GMT
Ehatv

Ehatv

Next Story