బాలీవుడ్ కింగ్ షారూక్‌ ఖాన్(Shah Rukh Khan) వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. పఠాన్‌(Phatan), జవాన్‌(Jawan) వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లను అందించిన షారూక్‌ ఇటీవల డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా హిట్‌టాక్‌ను సంపాదించింది.

బాలీవుడ్ కింగ్ షారూక్‌ ఖాన్(Shah Rukh Khan) వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. పఠాన్‌(Phatan), జవాన్‌(Jawan) వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్లను అందించిన షారూక్‌ ఇటీవల డంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా హిట్‌టాక్‌ను సంపాదించింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పఠాన్‌, జవాన్‌ సినిమాలతో పోలిస్తే బాక్సాఫీస్‌ దగ్గర ఫర్వాలేదనిపించుకుంది. 470 కోట్ల రూపాయలు వసూలు చేసింది. లేటెస్ట్‌గా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్‌ అవుతోంది. నిజానికి ఈ సినిమా జనవరిలోనే ఓటీటీలోకి రావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండానే డంకీ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌,యానిమల్‌,గుంటూరు కారం(Guntur Karam), హాయ్‌నాన్న(Hi nana) వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు డంకీ(Dunki) సినిమా కూడా వచ్చేసింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.

Updated On 15 Feb 2024 1:16 AM GMT
Ehatv

Ehatv

Next Story