బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు.. సల్మాన్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. మీడియాపై మండిపడ్డారు.. మరీ ముఖ్యంగా తన ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్లపై కోపం చూపించారు. తనకు కలిగిన అసౌకర్యం తన ముఖంలో తెలిసేలా చేశాడు సల్మాన్. ఇక ఇదంతా ఎక్కడ జరిగిందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో.. కండల వీరుడు.. సల్మాన్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. మీడియాపై మండిపడ్డారు.. మరీ ముఖ్యంగా తన ఎదురుగా ఉన్న ఫోటోగ్రాఫర్లపై కోపం చూపించారు. తనకు కలిగిన అసౌకర్యం తన ముఖంలో తెలిసేలా చేశాడు సల్మాన్. ఇక ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. ఓ స్టార్ యాక్టర్ బర్త్ డే వేడుకల్లో. బాలీవుడ్ స్టార్ సోహెల్ ఖాన్ బర్త్ డే సందర్బంగాసల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ నుంచి ఎంతో మంది స్టార్లు హాజరయ్యారు.

ఈ పార్టీలో సల్మాన్ అతని తల్లితో పాటు, సల్మాన్ తండ్రి సలీం ఖాన్, అతని రెండవ భార్య హెలెన్, సోదరుడు అర్బాజ్ ఖాన్, సోదరి అర్పితా ఖాన్ , ఆమె భర్త ఆయుష్ శర్మ, అర్పిత-ఆయుష్ పిల్లలు అహిల్ , ఆయుష్ శర్మ, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, వత్సల్ శేత్, ఇషితా దత్తా. ఈ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. తాజాగా సల్మాన్ ఖాన్ కోప్పడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సోహైల్ ఖాన్ బర్త్ డే వేడుకల్లో ఈ సీన్ కనిపించింది. సోహెల్ తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

అయితే పార్టీ అయిపోయి అంతావెళ్తున్నసందర్భంలో.. సల్మాన్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్‌ చేయి పట్టుకుని మెట్లు దిగడానికి సహాయం చేస్తూ కనిపించారు. అయితే అదే టైమ్ లో.. ఫోటోగ్రాఫర్‌లు ఒక్క సారిగా ముందుకు వచ్చి.. వారిని క్యాప్చర్ చేయడానికి చూశారు. దాంతో సల్మాన్ ఒక్క సారిగా సహనం కోల్పోయారు. వారిపై విరుచుకుపడ్డారు. కెమెరా మెన్ల పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సల్మాన్ ఖాన్. సల్మాన్‌కి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సల్మాన్ ఖాన్ కు వివాదాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన చాలా వివాదాలు ఫేస్ చేస్తున్నాడు. అంతే కాదు లారెన్స్ బిష్ణోయ్ నుంచి ప్రాణ హాని కూడా ఉండటంతో.. సల్మాన్ ను వై కేటగిరీలో బద్రత కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇలా గవర్నమెంట్లు కూడా భద్రత ఏర్పాటు చేసేంత వివాదాలు కోరి తెచ్చుకున్న కండల వీరుడు.. చాలా సార్లు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ పేరు వార్తల్లోకి ఎక్కింది.

Updated On 21 Dec 2023 7:44 AM GMT
Ehatv

Ehatv

Next Story