లేడీ డ్రెస్ కోడ్(lady dress code) వివాదంపై.. మరో వివాదానికి తెర తీశారు.. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సల్మాణ్ ఖాన్(salman khan). ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ సల్మాన్ ఏమన్నారంటే.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(salman khan).
లేడీ డ్రెస్ కోడ్(lady dress code) వివాదంపై.. మరో వివాదానికి తెర తీశారు.. బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సల్మాణ్ ఖాన్(salman khan). ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతకీ సల్మాన్ ఏమన్నారంటే.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(salman khan). ఇప్పటికే ఆయన చేసిన పనులకు చంపుతామ్ అంటూ..గ్యాంగ్ స్టార్స్(gangsters) వార్నింగ్ ఇవ్వడంతో పాటు..ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తున్నాడు. దాంతో ప్రభుత్వం ఆయనకు సెకురిటీ కూడా ఇచ్చింది. ఈక్రమంలో ఆయన మరోసారి వివాదాస్పంద వ్యాఖ్యలు చేసి.. హాట్ టాపిక్ అయ్యారు. మరో వివాదానికి తెర తీశారు.
మహిళల(women) శరీరాలు ఎంతో విలువైనవని.. వాటిని దుస్తులతో(clothes) ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని అన్నారు సల్మాన్ ఖన్. తాజాగా ఆప్ కీ అదాలత్(Aap Ki Adalat) టీవీషోలో పాల్గొన్న సల్మాన్.. ఈ వాఖ్యలు చేశారు. ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్‌ను యాంకర్ ప్రశ్నిస్తూ.. నో లో నెక్‌లైన్ గురించి ప్రశ్నించారు. సెట్‌లోని ఆడవారి బట్టల విషయంలో.. నియమం పెట్టిన మీరు.. సినిమాల్లో మాత్రం చొక్కా విప్పి నటిస్తారు కదా. ఇది ఎక్కడి న్యాయం అని అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెపుతూ.. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సల్మాన్ మాట్లాడుతూ.. మహిళల శరీరాలు చాలా విలువైనవని నా అభిప్రాయం. అందుకే వాటిని ఎంత ఎక్కువగా దుస్తులతో సంరక్షిస్తే అంత మంచిది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే చెబుతున్న మాట కాదు. అబ్బాయిల గురించి చెబుతున్నా. మన తల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్ల లాంటి మహిళలను వక్రబుద్ధితో చూసే కొందరి గురించి చెబుతున్నా. ఇలాంటి దుస్తుల వల్ల మహిళలు అవమానాలకు గురికాకూడదని నేను కోరుకుంటున్నాను అని వివరించారు. ప్రస్తుతం ఈవ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆమధ్య కిసీ కా భాయ్ కిసీ కీ జాన్(kisi ka bhai kisi ka jaan) సినిమాలో సల్మాన్‌తో కలిసి నటించారు పాలక్ తివారీ(palak thiwari). ఆయన రీసెంట్ గా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సెట్ లో అమ్మాయిల డ్రెస్ కోడ్ విషయంలో సల్మాన్ ఎలా ఉంటారో వివరించారు. సల్మాన్ ఆడవారి బట్టల విషయంలో చాలా స్ట్రీక్ట్ గా ఉంటారన్నారు. సెట్ లో ప్రతీ ఆడవారు బాడీ అంతా కవర్ చేసేలా బట్టలు వేసుకోవాలి అని ఆయన రూల్ పెడతారు. మెడ నుంచి కింది వరకు శరీరం కప్పి ఉన్న దుస్తులను మాత్రమే వేసుకోవాలి అని చెప్పారు. దాంతో ఈ విషయంలో సల్మాన్ ఖాన్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక తనను చంపుతామంటూ..గ్యాంగ్ స్టార్స్ చేస్తున్న బెదిరింపులపై కూడా సల్మాన్ స్పందించారు. అభద్రతతో జీవించే కంటే భద్రత మధ్య ఉండటం మంచిది. బెదిరింపుల కారణంగా నాకు భద్రత పెంచారు. దీనివల్ల నేనిప్పుడు గతంలో మాదిరిగా రోడ్లపై సైకిల్ తొక్కడం, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడం కుదరదు. ట్రాఫిక్‌లోనూ నా చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అది ఇతరులకు అసౌకర్యంగా ఉంటుంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. భగవంతుడిపై భారం వేశా. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా. చాలా జాగ్రత్తగా ఉంటున్నాఅని అన్నారు సల్మాన్.