సినిమా అవార్డులు చిననవైనా..పెద్దవైనా.. వాటికోసం ఎదురు చూస్తుంటారు.అవార్డ్స్ ను చాలా మందినటీనటులు అపరూపంగా చూసుకుంటారు. అంతే కాదు అవార్డ్స్ రాలేదని బాధపడేవారు ఉన్నారు. తక్కువ వచ్చాయని ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. ఇక వారితో పాటు విచిత్రం గా అవార్డ్స్ ను వద్దు అనేవారు కూడా కొంత మంది ఉన్నారు. వచ్చిన అవార్డ్స్ ను చులకనగా చూసే జనాలు కూడా లేకపోలేదు.
సినిమా అవార్డులు చిననవైనా..పెద్దవైనా.. వాటికోసం ఎదురు చూస్తుంటారు.అవార్డ్స్ ను చాలా మందినటీనటులు అపరూపంగా చూసుకుంటారు. అంతే కాదు అవార్డ్స్ రాలేదని బాధపడేవారు ఉన్నారు. తక్కువ వచ్చాయని ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. ఇక వారితో పాటు విచిత్రం గా అవార్డ్స్ ను వద్దు అనేవారు కూడా కొంత మంది ఉన్నారు. వచ్చిన అవార్డ్స్ ను చులకనగా చూసే జనాలు కూడా లేకపోలేదు. ఆకోవకు చెందినవాడే బాలీవుడ్ స్టార్ యాక్టర్ నసీరుద్దీన్ షా(Naseeruddin Shah).
బాలీవుడ్ లో స్టార్(Bollywood Star)యాక్టర్ ఇమేజ్ ఉన్న నసీరుద్దీన్ షా(Naseeruddin Shah) ఒకప్పుడు హీరోగా.. ఆ తరువాత విలన్ గా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటీన్యూ అవుతున్నారు. 72 ఏళ్ళ వయసులో కూడా.. ఓపికగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దాదాపు 40 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న నసీరుద్దీన్ షా తన కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. స్టేట్, నేషనల్ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు నసీరుద్దీన్ షా.
నసీరుద్దీన్ ఎంత పెద్ద యాక్టరో.. అంత కాంట్రవర్సియల్ స్టార్ కూడా. వివాదాల చుట్టు తిరగడం అంటే ఆయను ఎంతో ఇష్టం. కామెంట్స్ చేయాలి అన్నా.. వెనకా ముందు చూడరు.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అంటే తనకు ఇచ్చిన పాత్రకోసం ప్రాణం పెట్టేవాడు.. ఎంత కష్టపడేవాడే మంచి నటుడు అవుతాడు. అంతేకాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతన్ని ఉత్తమ నటుడు అని ఎవరో ప్రకటించడం అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు అన్నారు.
ఇక నటుడిగా తనకు వచ్చిన అవార్డులు చూసి పొంగిపోను అన్నారు నసీరుద్దిన్. అంతే కాదు ఆమధ్య తనకు ప్రకటించిన రెండు అవార్డులను తీసుకోవడానికి కూడా ఆయన వెళ్ళలేదన్నారు. కెరీర్ ఆరంభంలో అవార్డులు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నాక అవార్డుల మీద ఆసక్తి పోయింది. ఫిలింఫేర్ అని, ఇంకా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తారు. వాటిల్లో నాకేమి గొప్ప కనిపించట్లేదు అని అన్నారు.
అంతే కాదు ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఅవార్డ్ లు ఎలాఇస్తరో తెలిసిన తరువాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటికే నాకు చాలా అవార్డులు వచ్చాయి. ఒకవేళ నేను ఫామ్ హౌస్ కట్టుకుంటే దాంట్లో బాత్రూమ్స్ కి హ్యాండిల్స్ గా అవార్డులను పెట్టాలి అని అనుకుంటున్నాను. అప్పుడు వాష్ రూమ్ కి వెళ్లేవాళ్లంతా ఆ అవార్డులని పట్టుకుంటారు, అంటే ఆ అవార్డులు వాళ్లకి కూడా వచ్చినట్టే కదా అని వాటిని అవమానించే విధంగా మాట్లాడారు.
అంతే కాదు ఇప్పుడు వచ్చే అవార్డుల్లో చాలావరకు లాబీయింగ్ తోనే వస్తాయి. నిజమైన నటుడు అవార్డ్ ల కోసం తారాడడు. కానీ నాకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నప్పుడు మాత్రం సంతోషించాను అని అన్నారు. ఇక ససీరుద్ది వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో ఏ వివాదానికి దారి తీస్తాయో చూడాలి మరి.