బాలీవుడ్ స్టార్ హీరో(Bolywood Star Hero) సల్మాన్ ఖాన్(Salman Khan)కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ఈసారి దాడి చేసి తేదీని కూడా ప్రకటించాడు. ఏప్రిల్ 30న సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను రాకీ భాయ్ అని పరిచయం చేసుకున్నాడు. తాను జోధ్‌పూర్(Jodhpur)కు చెందిన గోసంరక్షకుడినని చెప్పాడు. సోమవారం రాత్రి 9 గంటలకు ముంబై పోలీస్(Mumbai Police) కంట్రోల్ రూమ్‌కి ఈ కాల్ వచ్చింది. బెదిరింపు కాల్ రావడంతో ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Salman KhanGets Another Threat Call

గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి. దీంతో ఈ మధ్యనే కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(new bullet-proof car) కొనుగోలు చేశాడు సల్మాన్ ఖాన్. గత నెల కూడా ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కు ముంబై పోలీసులు భద్రతను పెంచారు. అనంతరం సల్మాన్ ఖాన్ విదేశాల నుంచి కొత్త బుల్లెట్‌ఫ్రూట్ కారును కొనుగోలు చేశాడు. సల్మాన్ కొనుగోలు చేసిన కొత్తకారు పేరు నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీ. ప్రస్తుతానికి ఈ వాహనం భారత మార్కెట్లో విడుదల కాలేదు. సల్మాన్ భద్రతపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నారు. ఆయన నివాసం వెలుపల గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ముప్పును దృష్టిలో ఉంచుకుని.. అభిమానులను కూడా ఇంటి దగ్గర నిలబడనివ్వడం లేదు.
సల్మాన్ రాబోయే చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ట్రైలర్‌ను నిన్న సాయంత్రం లాంచ్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న సినిమా విడుదల కానుంది. ఇది కాకుండా.. సల్మాన్ త్వరలో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించనున్న 'టైగర్ 3' లో కనిపించనున్నాడు.