బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతుంటే.. అందం కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్లే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారిలో ఐశ్వరర్య రాయ్(Aishwarya Rai) కూడా ఒకరు. ఈమధ్యే పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాలో తన సత్తా చాటిన బ్యూటీ..

Aishwarya Rai Ramp Walk At Paris
బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతుంటే.. అందం కూడా అంతకంతకు పెరుగుతూ వెళ్లే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. వారిలో ఐశ్వరర్య రాయ్(Aishwarya Rai) కూడా ఒకరు. ఈమధ్యే పొన్నియన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాలో తన సత్తా చాటిన బ్యూటీ.. ఈసినిమాలో అందానికే అసూయపుట్టేంత అందంతో కనిపించి మురిపించింది. ఇక తాజాగా మరోసారి మోడల్ గా సత్తా చాటింది ఐశ్వర్య.
ఈ వయస్సులోను తగ్గేది లేదంటోంది బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఈ వయసులోనూ యంగ్ ఫ్యాషన్ మోడళ్లతో సమానంగా క్యాట్ వాక్ చేసి అభిమానులను హుషారెత్తించారు. 50 ఏళ్ల ఐశ్వర్యారాయ్ కు 12 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఉంది. ఇంత వయసు వచ్చినా కూడా.. ఏజ్ ఓన్లీ నెంబర్ మాత్రమే.. మనసుకు ఏజ్ లేదు.. అంటూ.. దూసుకుపోతోంది బ్యూటీ. ఐదు పదుల వయసులోను.. ఐశ్వర్యా రాయ్ ఇలా క్యాట్ వాక్(Cat walk) చేయడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.
ఇంతకీ ఈ ఫ్యాషన్ వాక్ ఎక్కడ జరిగింది. వివారాలు చూస్తే.. ప్యారిస్(Paris) ఫ్యాషన్ వీక్(Fashion Week) లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లోకి చేరాయి. ఐశ్వర్య వయసు తగ్గిందా? అన్నట్టుగా ఆమె ప్రదర్శన కనిపించింది. బ్రౌన్, గోల్డెన్ డ్రెస్ ధరించి, హెయిర్ కలర్ ను కూడా అందుకు అనుగుణంగా మార్చేశారు. ఆడియన్స్ చూసి ఐశ్వర్యారాయ్ చిలిపిగా కన్ను కొట్టడమే కాదు, ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఔరా అనిపించింది.
