బాలీవుడ్ సీనియర్ స్టార్ సునిల్ శెట్టి(Suniel Shetty) ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా(Social Media)లో ట్రోలింగ్స్ గురించి బాధపడ్డారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ టార్గెట్ గా చేసే ట్రోలింగ్ చూసేవారికి.. వినేవారికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాని ట్రోల్స్ ఫేస్ చేసేవారికి ఎంత మానసిక వేదన ఉంటుంది అనేది మాత్రం ఎవరూ ఆలోచించరు. కొంత మంది సెలబ్రిటీస్ ఇవి పట్టించుకోరు వదిలేస్తారు.
బాలీవుడ్ సీనియర్ స్టార్ సునిల్ శెట్టి(Suniel Shetty) ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా(Social Media)లో ట్రోలింగ్స్ గురించి బాధపడ్డారు.
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ టార్గెట్ గా చేసే ట్రోలింగ్ చూసేవారికి.. వినేవారికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాని ట్రోల్స్ ఫేస్ చేసేవారికి ఎంత మానసిక వేదన ఉంటుంది అనేది మాత్రం ఎవరూ ఆలోచించరు. కొంత మంది సెలబ్రిటీస్ ఇవి పట్టించుకోరు వదిలేస్తారు. కాని మరికొందరిని మాత్రం ట్రోల్స్ బాధిస్తాయి. సున్నితంగా ఉన్నవారు మాత్రం బాగా ఇబ్బందిపడుతుంటారు. అయినా ట్రోలర్స్ కు కనికరం మాత్రం ఉండదు. ఈక్రమంలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఈ విషయంలో తన బాధను వ్యాక్త పరిచారు.
తనపై.. తన ఫ్యామిలీపై వస్తున్న ట్రోలింగ్.. పైన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ బాగా డిస్ట్రబ్ అవుతుందని.. వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందన్నారు. తాను కూడా వివిధ సందర్భాల్లో ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని చెప్పారు. తన తల్లి, కూతురు పైన ఓ వ్యక్తి అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు.
ది రణవీర్ షో(The Ranveer Show)కు ఆయన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇలా వాఖ్యానించారు. సోషల్ మీడియా వల్ల ప్రైవసీ లేకుండా పోతోందన్నారు. జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తోందన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి సందర్భాలు ఫేస్ చేస్తూ... ఇబ్బంది పడుతున్నారు.
ఏదైనా మాట్లాడితే దానిని మరో రకంగా ఎడిట్ చేసి, తమకు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఏం మాట్లాడాలన్నా తనకు భయం వేస్తోందన్నారు. ఒక మాట మాట్లాడితే పదిహేను రకాలుగా దానిని ప్రచారం చేస్తున్నారన్నారు. తనది పాతతరమని, అందుకే సోషల్ మీడియా ట్రోల్స్ తనను బాధిస్తుంటాయన్నారు.