ధృవ సర్జా ( Dhruva Sarja) హీరోగా నటిస్తున్న కన్నడ చిత్రం కేడీ (KD) సెట్స్‌లో సంజయ్ దత్(Sanjay Dutt)కు ప్రమాదం జరిగింది. బాంబ్ బ్లాస్ట్ ఫైట్ సీన్స్‌ను షూట్ చేస్తుండగా.. బాంబ్ పేలి సంజయ్ (Sanjay) తలకు, ముఖానికి, మోచేతికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపు షూటింగ్ నిలిపివేశారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన బెంగళూరులోని మాగడి రోడ్డులో జరిగింది.

Sanjay Dutt

అదృష్టవశాత్తు సంజయ్ దత్(Sanjay Dutt) పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేడీ:ది డెవిల్ (KD- The Devil) చిత్రంలో సంజయ్ దత్ (Sanjay Dutt) విలన్‌గా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటటే ఈ సినిమాతో శాండల్ వుడ్‌లోకి శిల్పాశెట్టి (Shilpa Shetty) కూడా రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె సత్యవతి క్యారెక్టర్లో కనిపించనుంది.
యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్-2 (K.G.F-2) చిత్రంలో అధీరా క్యారెక్టర్లో సంజయ్ దత్ కనిపించారు. సంజయ్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే ప్రేమ్ (Prem) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.