మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(Ilayaraja).. ఏడో దశకంలో పిల్ల తెమ్మరగా ప్రవేశించిన ఆయన అనతి కాలంలోనే సంగీత ప్రపంచాన్ని మకుటమాయంగా ఏలిన రారాజు అయ్యారు. సంగీతానికి ఆయన మారుపేరు. అనేక భాషలలో సంగీతాన్ని అందించిన ఇసై జ్ఞాని. అద్భుతమైన గాయకుడు కూడా! సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉంది. అనేక పాటలు రాశారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా(Ilayaraja).. ఏడో దశకంలో పిల్ల తెమ్మరగా ప్రవేశించిన ఆయన అనతి కాలంలోనే సంగీత ప్రపంచాన్ని మకుటమాయంగా ఏలిన రారాజు అయ్యారు. సంగీతానికి ఆయన మారుపేరు. అనేక భాషలలో సంగీతాన్ని అందించిన ఇసై జ్ఞాని. అద్భుతమైన గాయకుడు కూడా! సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉంది. అనేక పాటలు రాశారు. సంగీతంలో సింఫనీ చేసిన ఘనత ఆయనది! ఇప్పటికే 1400 సినిమాలకుపైగా పని చేసి రికార్డు నెలకొల్పారు. అలాంటి సంగీత సమ్రాట్టు జీవిత చరిత్రను(Ilayaraja biopic) సినిమాగా తీయాలనుకుంటున్నారు. ఈ ఆలోచన వచ్చింది బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ దర్శకుడికి! హిందీలో పలు చిత్రాలు తీసి ప్రసంశలు అందుకున్న దర్శకుడు బాల్కీ(Balki)ఇప్పటికే హీరో ధనుష్‌తో(dhanush) షమితాబ్(Shamitab) అనే సినిమా తీశారు.
ఇందులో బిగ్‌బి అమితాబ్ బచ్చన్(Amitabh Bhchchan) కూడా నటించారు. అలాగే బాల్కీ నటుడు ధనుష్‌కు క్లోజ్ ఫ్రెండ్ కూడా! ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు ఇళయరాజాగా ధనుష్‌ను చూడాలని బాల్కీ అనుకుంటున్నారు. ఆశపడుతున్నారు. ఇళయరాజా బయోపిక్ తీయాలని అనుకుంటున్నానని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రీసెంట్‌గా ఓ సమావేశంలో బాల్కీ చెప్పారు. ఇందులో ఇళయరాజాగా నటుడు ధనుష్‌తో నటింపచేయాలని అనుకుంటున్నానని కూడా అన్నారు. అన్నట్టు ధనుష్ కూడా ఆల్ రౌండరే! ఆయన పాటలు పాడతారు. పాటలు రాస్తారు. దర్శకత్వం వహిస్తారు. మంచి సినిమాలను నిర్మిస్తారు. ఇళయరాజాగా నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని ధనుష్ సన్నిహితుల దగ్గర అంటున్నారట! ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కే సుముహూర్తం కోసం ధనుష్ ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.