ఎన్టీఆర్‌(Jr.NTR) క్రేజ్‌ ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ఆర్‌ఆర్ఆర్‌(RRR) సినిమాలో తారక్‌ నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ(Anil Sharma) తాజాగా ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గదర్‌(Gadhar) సినిమాను నేటి తరం హీరోలతో చేయాల్సి వస్తే మాత్రం తారాసింగ్ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే సరితూగుతారని అనిల్‌ శర్మ చెప్పారు.

ఎన్టీఆర్‌(Jr.NTR) క్రేజ్‌ ఇప్పుడు దేశమంతటా వ్యాపించింది. ఆర్‌ఆర్ఆర్‌(RRR) సినిమాలో తారక్‌ నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ శర్మ(Anil Sharma) తాజాగా ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గదర్‌(Gadhar) సినిమాను నేటి తరం హీరోలతో చేయాల్సి వస్తే మాత్రం తారాసింగ్ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే సరితూగుతారని అనిల్‌ శర్మ చెప్పారు. తారాసింగ్‌(Tara singh) పాత్రకు న్యాయం చేయగలిగే యువ హీరోలు బాలీవుడ్‌లో లేరని, దక్షిణాదిలో చాలా మంది ఉన్నారని చెప్పిన అనిల్‌ శర్మ ముఖ్యంగా ఎన్టీఆర్‌ అయితే ఈ పాత్రకు సరైన న్యాయం చేయగలరు అని కుండబద్దలు కొట్టారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మాట అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి తారక్‌ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

అనిల్‌ శర్మకు దర్శకుడిగా బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. సీరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ సినిమాలను ఆయన తెరకెక్కిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ 2001లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది. ఇందులో సన్ని డియోల్‌(Sunny Dieol) తారాసింగ్ పాత్రను పోషించారు. 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించారు. గదర్‌ 2గా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. పాకిస్తాన్‌ చెరలో బందీగా ఉన్న తన కుమారుడిని విడిపించుకోవడానికి తారాసింగ్‌ ఏం చేశాడన్నదే సినిమా ప్రథాన ఇతివృత్తం. ఈ పాయింటే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇదే ఇంటర్వ్యూలో గదర్‌ 3 గురించి అనిల్‌ శర్మ మాట్లాడారు. ప్రస్తుతానికి గదర్‌ 3ను నిర్మించే ఆలోచన తనకు లేదని, తీస్తే మాత్రం ఎన్టీఆర్‌ మాత్రమే తారాసింగ్‌ పాత్రకు సరితూగుతాడని అన్నారు.

Updated On 4 Sep 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story