స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌(JR NTR) జాతీయ స్థాయి నటుడయ్యాడు.

స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌(JR NTR) జాతీయ స్థాయి నటుడయ్యాడు. ట్రిపులార్‌తో(RRR) దేశమంతటా అభిమానులను ఏర్పరచుకున్నాడు. త్వరలోనే బాలీవుడ్‌లోనూ (BOLLYWOOD)అడుగుపెట్టబోతున్నాడు. ఎన్టీఆర్‌కు నటన సహజసిద్ధంగా అబ్బంది. నటనతో పాటు అతడు అద్భుతమైన డాన్సర్‌. ఎంత సంక్లిష్టమైన స్టెప్పులను కూడా ఈజీగా చేసి పారేస్తాడు. అందుకే ఆయనతో పని చేయడానికి కొరియోగ్రాఫర్లు(choreographer) ఇష్టపడతారు. ఎన్టీఆర్‌ను అభిమానించే కొరియోగ్రాఫర్ల లిస్టులో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బోస్కో మార్టిస్‌(BOSKO MARTIES) కూడా చేరాడు. ఆయన ఎన్టీఆర్‌ డాన్స్‌ గురించి బోల్డన్ని కితాబులిచ్చాడు. ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చని అంటున్నాడు. దేవర(DEVARA): పార్ట్‌ వన్‌ సినిమాకు బోస్కో మార్టిసే కొరియోగ్రాఫర్‌ అన్న విషయం తెలిసిందే. దేవర సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన బోస్కో మార్టిస్‌ అందులో చాలా భాగం ఎన్టీఆర్‌కే కేటాయించారు. ' నేను దేవర మూవీకి పని చేస్తున్నాను. హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అద్భుతమైన వ్యక్తి. సూపర్‌గా డ్యాన్స్‌ చేసే హీరోల్లో ఈయన ఒకరు. ఏ స్టెప్పులైనా సులువుగా నేర్చేసుకుంటాడు. ఆయన డ్యాన్స్‌ చేయడం చూస్తుంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్‌ మనం ఎంజాయ్‌ చేస్తాం. తనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం' అని ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవల తారక్‌తో కలిసి దిగిన ఫోటోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు బోస్కో. విక్కీ కౌశల్(VICKY KAUSHAL) నటించిన బ్యాడ్‌ న్యూస్‌లోని(BAD NEWS) తాబ తాబ పాట ఇటీవల విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ పాటకు స్టెప్పులను కనిపెట్టింది బోస్కోనే! కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్‌ 27న ఈ సినిమా విడుదల కానుంది.

Eha Tv

Eha Tv

Next Story