రాజమౌళి(rajamouli) డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌(ntr), రామ్‌చరణ్‌(ramcharan) హీరోలుగా వచ్చిన ఆర్ఆర్‌ఆర్‌(RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే! నాటునాటు పాటకు ఆస్కార్‌(oscar)అవార్డు కూడా వచ్చింది. దేశ విదేశాల్లో జెండా ఎగరేసింది. జపాన్‌లోనూ రికార్డు బద్దలు కొట్టింది. ఇన్నేసి రికార్డును సాధించిన ట్రిపులార్‌ మూవీ రికార్డును ఓ బాలీవుడ్‌ మూవీ తుడిచిపెట్టేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే కదా! నిన్నటి వరకు ట్రిపులార్‌ 25 మిలియన్‌ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండింది.

రాజమౌళి(rajamouli) డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌(ntr), రామ్‌చరణ్‌(ramcharan) హీరోలుగా వచ్చిన ఆర్ఆర్‌ఆర్‌(RRR) మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే! నాటునాటు పాటకు ఆస్కార్‌(oscar)అవార్డు కూడా వచ్చింది. దేశ విదేశాల్లో జెండా ఎగరేసింది. జపాన్‌లోనూ రికార్డు బద్దలు కొట్టింది. ఇన్నేసి రికార్డును సాధించిన ట్రిపులార్‌ మూవీ రికార్డును ఓ బాలీవుడ్‌ మూవీ తుడిచిపెట్టేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే కదా! నిన్నటి వరకు ట్రిపులార్‌ 25 మిలియన్‌ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండింది. చోర్‌ నికల్‌ కే భాగా (chor nikal ke bhaga) సినిమా కారణంగా రెండో స్థానంలోకి దిగజారింది. హైజాకింగ్‌ సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ డ్రామాగా తెరకెక్కిన చోక్‌ నికల్‌ కే భాగా సినిమాలో యామీ గౌతమ్‌(yami gautam), సన్నీ కౌశల్‌ (sunny kaushal), శరద్‌ ఖేల్కర్‌ (sharad kelkar) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 29 మిలియన్‌ అవర్స్‌ వీక్షించినట్టు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా చోర్‌ నికల్‌ కే భాగా సినిమా రికార్డు సృష్టించింది. మూడో స్థానంలో అలియాభట్‌ ప్రధాన పాత్రలో వచ్చిన గంగూబాయి కతియావాడి నిలిచింది. ఈ సినిమా 22 మిలియన్‌ అవర్స్‌తో మూడో స్థానంలో ఉంది.

Updated On 7 April 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story