✕
Bollywood Negitive on Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ అంటే బాలీవుడ్ ఎందుకు అంత విషం కక్కుతోంది.?
By EhatvPublished on 1 April 2023 4:34 AM GMT
2020 ఆగస్టులో ఆదిపురుష్ నిర్మాణం మొదలైంది. తొలి రోజున నిర్మాణ సంస్థ టీ సిరీస్ లాంఛనప్రాయంగా పోస్టర్ రిలీజ్ చేయగానే మరు క్షణమే విమర్శలు గుప్పుమన్నాయి. రాముడు పాత్ర రూపురేఖలు బాగాలేవని మొదలుపెట్టారు. చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే హెడ్‌లైన్స్‌కి ఎక్కిపోయే వసతిని ఈ రోజు సోషల్ మీడియా విరివిగా అందించడమన్నది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2021లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఆదిపురుష్ ఈ ఏడాది జూన్ 16 విడుదలవుతున్నట్టుగా తాజాగా సమాచారమందింది. ఈ సందర్భంలో నిర్మాతలు మరో పోస్టర్ విడుదల చేశారు.

x
Prabhas Adipurush Movie Update
-
- బాహుబలి చిత్రంతో భారతీయ బాహుబలిగా పేరు తెచ్చుకున్న మన ప్రభాస్ త్వరలో రామాయణం ఆధారంగా రూపొందుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ఆదిపురుష్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఊపందుకున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఎప్పుడు ఆదిపురుష్‌కు సంబంధించిన ఏ వార్త ప్రకటించినా విమర్శలు వ్యాఖ్యానాలు వెల్లువెత్తుతుండటం. 2020 ఆగస్టులో ఆదిపురుష్ నిర్మాణం మొదలైంది. తొలి రోజున నిర్మాణ సంస్థ టీ సిరీస్ లాంఛనప్రాయంగా పోస్టర్ రిలీజ్ చేయగానే మరు క్షణమే విమర్శలు గుప్పుమన్నాయి. రాముడు పాత్ర రూపురేఖలు బాగాలేవని మొదలుపెట్టారు. చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే హెడ్‌లైన్స్‌కి ఎక్కిపోయే వసతిని ఈ రోజు సోషల్ మీడియా విరివిగా అందించడమన్నది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. 2021లో షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఆదిపురుష్ ఈ ఏడాది జూన్ 16 విడుదలవుతున్నట్టుగా తాజాగా సమాచారమందింది. ఈ సందర్భంలో నిర్మాతలు మరో పోస్టర్ విడుదల చేశారు. మళ్ళీ విమర్శలు పడగ విప్పాయి.
-
- సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడు పాత్ర పోషిస్తుండగా, ఆ పాత్ర ఆహార్యం, గెటప్ ఏమీ బాగులేవని, హిందులవుల పైన గతకాలంలో అరాచకాలకు ఒడిగట్టిన తైమూర్, ఛెంగిజ్ ఖాన్, ఔరంగజేబులాటి వారిలా ఉన్నాడని ఒకటే రచ్చ. సైఫ్ గెటప్ ఖిల్జీలా ఉందని, ఇది హిందూ పురాణాలకే తలవంపులు తెస్తున్నట్టుగా ఉందని విరుచుకుపడ్డారు. ఇంక కోర్టుల్లో వ్యాజ్యాలు తెచ్చారు. మరో అడుగు ముందుకేసి, ఆదిపురుష్ చిత్రం, పూర్తిగా ఇస్లామైజ్(Islamize) అయిందని, ఈ చిత్రం విడుదలైతే హిందు ఇతిహాసాలకు ఇంతకన్నా అగౌరవం, అప్రతిష్ట మరొకటి లేవని చాలా మంది కోర్టుల్లో కేసులు బనాయించారు. దుమ్మెత్తిపోశారు. కానీ నిర్మాతలు, దర్శకుడు ఎక్కడా నోరు మెదపకుండా వారిపనిలో వారు నిమగ్నమై, కష్టపడుతున్నారు. సర్వబ్రాహ్మణ మహాసభ అయితే నెత్తీనోరు కోట్టేసుకుంటోంది. కొన్ని సీన్లు తొలగించాలని, ఆసభ్యకరంగా ఉన్న సంభాషణలను బేషరతుగా తీసివెయ్యాలని తీవ్రంగా ప్రతిఘట్టించడం దేశమంతా గమనిస్తోంది.
-
- వానరసేన స్టూడియోస్ తయారు చేసిన మహాశివుడి పోస్టర్ని కాపీకొట్టి ప్రభాస్ రాముడి పాత్రను తయారుచేశారని వానరసేన కూడా ఛాలెంజ్‌లు విసురుతోంది. మధ్యప్రదేశ్ హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా కూడా తోక తొక్కారు. హిందూ దేవుళ్ళను టోటల్‌గా తప్పుతోవ పట్టిస్తున్నారని ఆదిపురుష్ దర్శక నిర్మాతలపైనే కాదు ప్రభాస్‌ను కూడా తిట్టిపోశారు. రామాయణంలోని ప్రతీపాత్ర ఎలా ఉంటుందన్నది ప్రతీ భారతీయుడి మనసులో నిక్షిప్తమై ఉందని, హనుమంతుడు తోలు బెల్టులు ధరించడమేమిటని, హనుమంతుడు ఎప్పుడూ అటువంటి దుస్తులు ధరించనే లేదని మిశ్రా చిందులు తొక్కారు.
-
- విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఘోరంగా ఉందని, ఛోటా భీమ్, టెంపుల్ రన్ వంటి అత్యంత ప్రాచుర్యం పొందిన యానిమేషన్ ఫిల్మ్స్‌కి ఇమిటేషన్లా ఆదిపురుష్ వర్క్ ఉందని అన్నది నెటిజన్లు అంటున్నారు. 2022 అక్టోబర్ 2న విడుదలైన టీజర్ చూసి, సైఫ్ ఆలీఖాన్ పోషించిన రావణాసురుడు పాత్ర దరిద్రంగా ఉందని, మహశివభక్తుడైన రావణాసురుడి నుదుటిపైన విభూతి త్రిపుండ్రాలు ఎందుకు లేవని గగ్గోలు పెట్టారు నెటిజన్లు. అయితే అంతర్గతంగా ఉన్న అసూయ, కుళ్లును ఉత్తరాదివారు ఇలా బయటపెట్టుకుంటున్నరని కొందరు అంటున్నారు.
-
- దాదాపు 600 కోట్ల భారీవ్యయంతో ఆదిపురుష్ తెరకెక్కుతోంది. పైగా రాముడంటే భారతదేశమంతా ఎంతో భక్తిప్రపత్తులతో పూజించి, ఆదాధించే ఏకైక దేవుడు. అదనంగా ప్రభాస్. ఈ చిత్రం కూడా అత్యధిక వసూళ్ళను రాబట్టి, మొత్తం రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేసి , కొత్త రికార్డులను నెలకొల్పి, సరికొత్త సంచనాలను సృష్టించాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సరికొత్త రికార్డులను సాధించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆదిపురుష్ పైన కొందరు విషం కక్కుతున్నారని, ప్రభాస్ సుప్రిమసీని చూసి ఓర్వలేక కొందరు బాలీవుడ్ ప్రముఖులే ఈ విధమైన దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని అంటున్నారు.

Ehatv
Next Story