ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) హీరోగా తెరకెక్కుతోన్నదేవర(Devara) సినిమాలో.. మరో బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందట. ఇంతకీ ఎవరామె.. ఎంటా సంగతి.

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఎన్టీఆర్(Jr.NTR) హీరోగా తెరకెక్కుతోన్నదేవర(Devara) సినిమాలో.. మరో బాలీవుడ్ బ్యూటీ నటించబోతుందట. ఇంతకీ ఎవరామె.. ఎంటా సంగతి.

గ్లోబల్ స్టార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా దేవర. ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈసినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్ గా సౌత్ ఎంట్రీ ఇస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. దేవర హీరోయిన్ కు సబంధించిన ఓ క్రేజీ రూమర్ షికారు చేస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) నటించబోతున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని సమాచారంటాక్. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఎందుకుంటే వీరి కాంబినేషన్ లో గతంలో .. జనతా గ్యారేజ్ మూవీ వచ్చింది. ఇక దేవర సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాలో యాక్షన్ సీన్స్ కోసం భారీగా కసరత్తు చేశాడు కొరటాల. హాలీవుడ్ నుంచి స్టంట్స్ మాస్టర్స్ ను రంగంలోకి దింపాడు. రక్తపాతం గట్టిగానే ఉంటేట్టు ఉంది. అందుకే ట్యాంకర్ల కొద్ది డూప్ బ్లడ్ ను తరలించారు. ఇక ఈసినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ చేపలు పట్టే వారి కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించబోతోంది.

Updated On 2 Oct 2023 7:59 AM GMT
Ehatv

Ehatv

Next Story