రీసెంట్ గా జరిగిన రెండు సంఘటనల వల్ల తాను షాక్ కుగురయ్యాను అంటుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా. ఆ రెండుతలుచుకుంటే.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటోంది బీటౌన్ బ్యూటీ.
రీసెంట్ గా జరిగిన రెండు సంఘటనల(Incidents) వల్ల తాను షాక్(Shock) కుగురయ్యాను అంటుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతీ జింటా(Preity Zinta). ఆ రెండుతలుచుకుంటే.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటోంది బీటౌన్ బ్యూటీ.
ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు తనను కలిచి వేశాయి అంటుంది.. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటా(Preity Zinta).. ఆ రెండు ఘటనలు తనను ఒకింత షాక్ గురిచేశాయని అంటుంది బాలీవుడ్ బ్యూటీ. తన కూతురికి గుర్తు తెలియని మహిళ గట్టిగా ముద్దాడటం.. విషయం ఏంటీ అంటే.. ?
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మంచి సినిమాలు చేసింది ప్రీతి జింటా(Preity Zinta). ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. ఇక ఆమె రీసెంట్ గా తనకు అనుభవంలోకి వచ్చిన రెండు షాకింగ్ సంఘటనల గురించి పంచుకుంది. తాను తన కూతురు ఒక చోట ఉండగా.. ఒక గుర్తు తెలియని మహిళ తమ దగ్గరికి వచ్చిందని. తన కూతురు తో ఓ ఫొటో తీసుకుంటాననిఆ మహిళ అడిగిందని, అందుకు తాను ఒప్పుకోలేదంటోంది ప్రీతి. అయితే అనూహ్యంగా ఆ మహిళ ఒక్కసారిగా తన కుమార్తెను గట్టిగా హత్తుకుని, మూతి పక్కన ముద్దుపెట్టిందని చెప్పింది. దాంతో ఏం జరుగుతుందో తెలియక షాక్ కు గురయ్యానంటోంది ప్రీతి. తాను ఆ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ మహిళ పారిపోయిందని అంటోంది ప్రీతి.
ఇక మరో సంఘటన తనను కలిచివేసిందంటూ బాధపడుతోంది ప్రీతి. తాను కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఒక దివ్యాంగుడు సహాయం కోసం వీల్‌చైర్‌లో తన కారు దగ్గరికి వచ్చాడని, తాను డబ్బులు లేవని చెప్పినా వినిపించుకోలేదని అన్నారు. తన పక్కనున్న మహిళ ఆమె పర్సు నుంచి కొంత చిల్లర తీసి ఇస్తే అది సరిపోదని విసిరికొట్టాడని, తాను వెళ్తుంటే వీల్‌చైర్‌తో వెంబడించాడని చెప్పింది. ఆ ఘటన కూడా తనను షాక్‌కు గురిచేసిందని తెలిపింది. ఈ రెండు సంఘటనలు తాను మర్చిపోలేనంటోందతి. అంతే కాదు ఈ విషయంలో తనపైనే ఎన్నో రకాలుగా ట్రోల్స్ వచ్చాయంటోంది ప్రీతి.