అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు కటీన్యూ అవుతుందో కూడా తెలియకుండానే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ బ్రో మూవీ షూటింగ్. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేనిఈసినిమా తమిళ సినిమా వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్‌ గా రూపొందుతుుంది. తమిళంలో ఈసినిమాను తెరకెక్కించిన నటుడు దర్శకుడు సముద్రఖని తెలుగులో కూడా ఈసినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు.

సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది పవర్ స్టార పవర్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) బ్రో మూవీ(Bro Movie). నెక్ట్స్ మంన్త్ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈక్రమంలో ఈమూవీ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు కటీన్యూ అవుతుందో కూడా తెలియకుండానే షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ బ్రో మూవీ షూటింగ్. నిన్న మొన్నటి వరకు పెద్దగా అంచనాల్లేనిఈసినిమా తమిళ సినిమా వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్‌ గా రూపొందుతుుంది. తమిళంలో ఈసినిమాను తెరకెక్కించిన నటుడు దర్శకుడు సముద్రఖని తెలుగులో కూడా ఈసినిమాను డైరెక్టర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. మూడు రోజుల క్రితం విడుదలైన మోషన్‌ పోస్టర్‌తో తిరుగులేని హైప్‌ క్రియేట్‌ అయింది.

శరవేగంగా జరుగుతున్న ఈసినిమా బ్రో టైటిల్ ప్రకటించగా.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. మామా అల్లుడు కలిసి పోస్టర్ లో కనిపించి ఊపు ఊపేశారు. అంతే కాదు ఈ పోస్టర్ తో అభిమానుల్లో జోష్‌ నింపుతుంది. అయితే ఈ సినిమాలో సాయి తేజ్ మెయిన్ హీరోగా నటిస్తుండగా .. మరో ప్రధాన హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ లీ పబ్ సెట్ ను కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశి రౌతులాను చిత్రబృందం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. పవన్ , సాయిధరమ్ తేజ్ లతో కలిసి ఊర్వశి చిందులు వేయనున్నట్లు సమాచారం. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇంత కాస్ట్ లీ పబ్ ను ఇప్పటివరకు నిర్మించలేరని ఇన్ సైడ్ టక్. ఇక ఈసినిమాను తమిళం నుంచి తెలుగులోకి మార్చడంలో త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశారు. తన మార్క్ డైలాగ్స్ రాశారు. ఇక థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

Updated On 4 Jun 2023 11:44 PM GMT
Ehatv

Ehatv

Next Story