✕
బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండేను(Poonam Pandey) పాడు క్యాన్స(Cancer)ర్ పొట్టన పెట్టుకుంది. 32 ఏళ్ల వయసున్న పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) కన్నుమూశారనంటూ ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram) ఖాతాలో వచ్చిన పోస్టు చూసి చాలా మంది షాకయ్యారు.

x
poo pandey-compressed
-
- బాలీవుడ్ సంచలన నటి పూనమ్ పాండేను(Poonam Pandey) పాడు క్యాన్స(Cancer)ర్ పొట్టన పెట్టుకుంది. 32 ఏళ్ల వయసున్న పూనమ్ గర్భాశయ క్యాన్సర్‌తో(Cervical cancer) కన్నుమూశారనంటూ ఆమె ఇన్స్టాగ్రామ్(Instagram) ఖాతాలో వచ్చిన పోస్టు చూసి చాలా మంది షాకయ్యారు. ఆమె టీమ్ పెట్టిన ఈ పోస్ట్ నిజం కాకుండా ఉండే బాగుండని కోరుకున్నారు. ఇంత చిన్న వయసులోనే ఆమె లోకం విడిచి వెళ్లిపోవడమేమిటని భావోద్వేగానికి లోనయ్యారు. మూడు పదుల చిన్న జీవితంలో ఆమె ఏనాడు సంపూర్ణ సంతోషాన్ని అనుభవించలేదు.
-
- ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన పూనమ్ పాండే గ్లామర్ కెరీర్ మోడల్‌గా మొదలయ్యింది. ఆమె ప్రతిభకు కొదవలేదు. దాంతో పాటు ఆత్మస్థయిర్యమూ ఎక్కువగానే ఉంది. ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే మోడలింగ్‌లో రాణించగలిగింది. అనతి కాలంలోనే ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలో చోటు సంపాదించుకుంది. 2011లో ఆమె చేసిన ఓ సంచలన ప్రకటన ఆమెను పాపులర్ చేసింది. వరల్డ్‌కప్ క్రికెట్లో టీమిండియా విజయం సాధిస్తే ఒంటిమీద బట్టల్లేకుండా తిరుగుతానని స్టేట్మెంట్ ఇచ్చారు.
-
- నిజానికి ఇది షాకింగ్ స్టేట్మెంటే! ఎన్ని గట్స్ ఉండాలి? ఈ ప్రకటన విన్న ఆమె తల్లి ఆమెను చితకబాదింది. ఇప్పుడు టీమిండియా వరల్డ్‌కప్‌ను గెల్చుకుంది కానీ పూనమ్ పాండే మాత్రం నగ్నంగా గ్రౌండ్లో పరుగెత్తలేదు. అందుకు కారణం బీసీసీఐ అనుమతించకపోవడం! మాట తప్పడం ఆమెకు నచ్చలేదు.
-
- కొన్ని వారాల తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంకోసం ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో బట్టలు లేకుండా తిరిగారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాతి ఏడాది కూడా ఇలాంటి తలతిక్క పనే చేసింది. ఈమె తనకంటూ సొంతంగా ఓ యాప్ కూడా తయారు చేయించుకుంది కానీ గూగుల్ వారికి అది నచ్చలేదు. దాన్ని బ్యాన్ చేసింది.
-
- సామ్‌బాంబేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ వారి కాపురం సజావుగా సాగలేదు. 2020, సెప్టెంబర్ 1వ తేదీన సామ్ బాంబే, పూనమ్ పాండేల పెళ్లయ్యింది. అది కరోనా కాలం కాబట్టే పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. పెళ్లయిన పది రోజులకే కాపురంలో కలతలు మొదలయ్యాయి. భర్తపై గృహహింస కేసు పెట్టారు పూనమ్.
-
- అత్యాచార వేధింపుల కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చిత్రమేమింటే జైలు నుంచి బయటకు రాగానే పూనమ్-సామ్బాంబేలు కలిసి పోవడం. గొడవలు, కలిసిపోవడాలు వారికి మామూలు అయ్యాయి. చివరకు విడాకులు తీసుకున్నారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకు పూనమ్‌ను జైల్లో పెట్టారు పోలీసులు. సినిమాల్లో కూడా ఆమె బోల్డ్ వేషాలేశారు. మొదటి సినిమా నషాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే టీచర్‌గా నటించారు. అసభ్యతతో కూడుకున్న ఆ సినిమా పోస్టర్లు కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.
-
- బాలీవుడ్లోనే కాకుండా భోజ్‌పురి, కన్నడ భాషల్లోనూ పూనమ్ నటించింది. తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా మాలిని అండ్ కో .'పెళ్లి చేసుకున్నాక నరకాన్ని అనుభవించాను. అకారణంగా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. అందరూ నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు తప్ప మనిషిగా ఏనాడూ చూడలేదు. నన్ను తిట్టుకునే మందు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి' అంటూ లాకప్ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు పూనమ్ పాండే! ప్రేమ కోసం జీవితాంతం పరితపించారు. ఎవరూ రవ్వంత ప్రేమను ఆమెకు ఇవ్వలేకపోయారు. పూనమ్ పాండే ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం!

Ehatv
Next Story