బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే(Poonam pandey) చనిపోయిందన్న వార్త శుక్రవారం వైరల్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) పేజీలో పీఆర్‌ టీమ్‌ షేర్‌ చేసిన నోట్‌లో పూనమ్‌ పాండే చనిపోయారని రాశారు. అది చూసి అందరూ షాక్‌ అయ్యారు.

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే(Poonam pandey) చనిపోయిందన్న వార్త శుక్రవారం వైరల్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) పేజీలో పీఆర్‌ టీమ్‌ షేర్‌ చేసిన నోట్‌లో పూనమ్‌ పాండే చనిపోయారని రాశారు. అది చూసి అందరూ షాక్‌ అయ్యారు. 32 ఏళ్ల వయసులోనే ఆమెకు నిండునూరేళ్లు నిండిపోయాయా అంటూ ఆవేదన చెందారు. అభిమానులైతే దుఃఖించారు. అయితే తాజాగా ఆమె నుంచి ఓ షాకింగ్‌ మెసేజ్‌ వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ తన ఎక్స్‌ పేజీలో ఓ పోస్ట్‌ పెట్టింది. తనకు కేన్సర్‌ లేదని, సర్వైకల్‌ కేన్సర్‌(Cervical Cancer) గురించి అవగాహన కల్పించడానికే ఆ విధంగా చేశానని చెబతూ పూనమ్‌ పాండే వీడియో సందేశాన్ని రిలీజ్‌ చేసింది. ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 'మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలని నేను భావిస్తున్నాను. నేను బతికే ఉన్నాను. గర్భాశయ ముఖద్వారా కేన్సర్‌ (సర్వైకల్‌ కేన్సర్‌) తో నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదు. ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అనేక మంది మహిళల చనిపోతున్నారు. కొన్ని ఇతర కేన్సర్లలా కాకుండా సరైన చికిత్స తీసుకుంటే సర్వైకల్ కేన్సర్‌ నుంచి బయటపడవచ్చు. HPV వ్యాక్సిన్‌ను ముందస్తుగా తీసుకుంటే దీనిని ఎదుర్కొనవచ్చు . ఈ వ్యాధితో ఎవరూ తమ ప్రాణాలను కోల్పోకుండా చూసుకునే మార్గాలు వ్యైద్యశాస్త్రంలో ఇప్పుడు ఉన్నాయి. గర్భాశయ కేన్సర్‌ విషయంలో ప్రతి మహిళ తీసుకోవలసిన చర్యల గురించి అందరికీ తెలిసేలా చేద్దాం' అని పూనమ్‌ పాండే తెలిపింది. తన చావువార్త విషయంలో అందరూ క్షమించాలని పూనమ్‌ పాండే వేడుకుంది. మహిళలలో ఎంతో నిశ్శబ్ధంగా వ్యాపిస్తున్న గర్భాశయ కేన్సర్‌ గురించి అందరికీ తెలిసేలా చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని పూనమ్‌ పాండే తెలిపింది. ఆమె ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఎంచుకున్న మార్గమే సరైంది కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Updated On 3 Feb 2024 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story