ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghava), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి(parineethi) చోప్రాల నిశ్చితార్థం(engagement) ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. నిశ్చితార్థం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త కోడలు ఇంటికి రానున్న సందర్భంగా.. రాఘవ్ చద్దా అధికారిక బంగ్లాను పెళ్లికూతురులా అలంకరించారు.
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghava), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి(parineethi) చోప్రాల నిశ్చితార్థం(engagement) ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల్లో ఆనంద వాతావరణం నెలకొంది. నిశ్చితార్థం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త కోడలు ఇంటికి రానున్న సందర్భంగా.. రాఘవ్ చద్దా అధికారిక బంగ్లాను పెళ్లికూతురులా అలంకరించారు. రాఘవ్ చద్దా ఇంటి బయట పూలతో రంగోలి వేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాఘవ్ చద్దా ఇంటి ప్రధాన ద్వారం వద్ద రంగోలీ పూలతో, దీపాల కాంతులతో అందంగా అలంకరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాఘవ్ చద్దా ఇల్లు సందడిగా మారింది.
న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో వీరి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థం వేడుక సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. సిక్కు ఆచారాల ప్రకారం నిశ్చితార్థం జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ మార్గంతో వేడుక ప్రారంభమవుతుంది. నిశ్చితార్థానికి ఇరు కుటుంబాలు, సన్నిహితులైన 150 మందిని ఆహ్వానించారు. ఈ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, నటి ప్రియాంక చోప్రా హాజరుకానున్నారు. నిశ్చితార్థం వేడుక కోసం.. రాఘవ్.. పవన్ సచ్‌దేవ్ డిజైన్ చేసిన అచ్కాన్‌ను ధరించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించనుంది.