సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగువారికి ఆత్మీయురాలిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన మేడ్ ఇన్ హెవెన్-2(Made in Heaven Season 2)లో నటించారు. అభిమానులను మెప్పించారు.
సీతారామం(Sita Ramam) సినిమాతో తెలుగువారికి ఆత్మీయురాలిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన మేడ్ ఇన్ హెవెన్-2(Made in Heaven Season 2)లో నటించారు. అభిమానులను మెప్పించారు. లేటెస్ట్‌గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆకస్తికరమైన వ్యాఖ్యలు చేశారు మృణాల్ ఠాకూర్. అలాగే తెలుగు ప్రేక్షకులు తనను ఎంతగానో ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వివాహ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి దొరికితే వారిని పెళ్లి చేసుకోవచ్చని మృణాల్ తెలిపారు. ' మా ఫ్యామిలీలో, బంధువుల్లో చాలా మంది పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నారు. వారంతా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. మన మనస్తత్వానికి సరిపోయే వ్యక్తి కనిపిస్తే వారిని పెళ్లి చేసుకోవడానికి వయసుతో పని లేదని నా అభిప్రాయం. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఎప్పుడైనా అలాంటి వారు మనకు ఎదురుపడవచ్చు. అలాంటి వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకోండి' అని మృణాల్ చెప్పారు. తాను నటించిన సినిమాల గురించి చెబుతూ ' సినిమాల విజయానికి నిర్వచనం నాకు తెలియదు. నేను చేసిన పలు చిత్రాలు వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరాయి. మరికొన్ని మంచి గుర్తింపును తెచ్చాయి. తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపుతున్నారు. నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించారు. నన్ను వారి కుటుంబంలోని వ్యక్తిగా భావిస్తారు. ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక సీతారామం సినిమాతో ప్రేక్షకుల నుంచి అమితమైన ప్రేమను పొందాను' అని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అయిదు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని సరసన మృణాల్ నటిస్తోన్న హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 21న విడుదల కానుంది. దీనికి శౌర్య దర్శకత్వం వహిస్తున్నాడు. అతడికి ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇందులో శ్రుతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా మృణాల్ నటించబోతున్నారు.