వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని(Kiara Advani). తాజాగా ఆమె ఓ కాస్ట్లీ కారు కొని సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యారు. ఇంతకీ ఆ కారు కాస్ట్ ఎంతో తెలుసా..?
అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కియారా అద్వానీ. సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతోంది బ్యూటీ. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కియారా..

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని(Kiara Advani). తాజాగా ఆమె ఓ కాస్ట్లీ కారు కొని సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అయ్యారు. ఇంతకీ ఆ కారు కాస్ట్ ఎంతో తెలుసా..?

అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కియారా అద్వానీ. సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతోంది బ్యూటీ. బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తున్న కియారా.. టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ జోడీగా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. ఇక ఈబ్యూటీ..భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆరతువాత రామ్ చరణ్ తో చేసిన సినిమా ప్లాప్ అవ్వడంతో.. బాలీవుడ్ కు మాత్ర పరిమితం అయ్యింది.

ఇక తాజాగా శంకర్ పిలుపుతో మళ్లీ టాలీవుడ్ కు వచ్చి... మెగా పవర్ స్టార్ తో రెండో సారి జంటగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా క్రేజ్ తో అత్యంత భారీగా విడుదల చేయనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఈమధ్యే బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను పెళ్లాడి ఓ ఇంటికి కోడలుగా వెళ్లింది బ్యూటీ. తాజాగా ఆహె కాస్ట్లీ కారు కొని మరోసారి వర్తల్లో నిలిచింది. ఇంతకీ కియార కొన్న కారుఏంటో తెలుసా.. ?

తాజాగా ఈ కియారా అద్వాని ఓ కాస్ట్లీ కారు కొన్నది. ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-580 4 కారును ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కారు విలువ ఇండియన్ మార్కెట్‌లో దాదాపు 3 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. మే 26న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముంగిచేసినట్టు తెలుస్తోంది. మ్యాటిక్ మోడల్ కారులో దర్జాగా ముంబయ్ లోని డబ్బింగ్ స్టూడియోకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కారును ఆమె తన అసలు పేరు అలియా అద్వానీ పేరుతో రిజిస్టర్ చేసుకుంది కియారా అద్వాని.

Updated On 2 Jun 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story