బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) 2021లో హీరో విక్కీ కౌశల్‏(Vicky Kaushal)ని పెళ్లి చేసుకున్న సంగతి మందరికీ తెలిసిందే. కొంతకాలంగా పాటు ప్రేమ వ్యవహారం నడిపిన ఈ జంట 2021లో పెళ్లిపీటలెక్కి ఒక్కటయ్యారు. పెళ్లయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఈ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif) 2021లో హీరో విక్కీ కౌశల్‏(Vicky Kaushal)ని పెళ్లి చేసుకున్న సంగతి మందరికీ తెలిసిందే. కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారం నడిపిన ఈ జంట 2021లో పెళ్లిపీటలెక్కి ఒక్కటయ్యారు. పెళ్లయి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఈ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్‏గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చెల్లెలు అర్పితా ఖాన్ (Arpita Khan) ముంబైలో గ్రాండ్‏గా ఈద్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె.. అనార్కలి డిజైనర్ డ్రెస్‏ని ధరించి స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచింది. ఆమె కారు దిగి నడుచుకుంటూ వచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అప్పుడు ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో అందులోనూ ఆమె పొట్టకొంచెం ముందుకు కనిపించడంతో కత్రినా తల్లికాబోతుందంటూ ఓ రూమర్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొంతమంది ఫ్యాన్స్ ఈ రూమర్స్ పై రియాక్ట్ అవుతూ ఒక వేళ ఆ న్యూస్ నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటూ మెసెజ్‏లు చేస్తున్నారు. ఈ విషయంపై కత్రినా కైఫ్ నుంచి అఫిషియల్ అనౌన్స్‏మెంట్ వచ్చే వరకు కాస్త ఓపికపట్టాల్సిందే మరి. ఇక కత్రినా కైఫ్ విషయానికి వస్తే ఆమె బాలీవుడ్ ఆడియన్స్‏కే కాక ఇటు టాలీవుడ్ ఆడియన్స్ కు సుపరిచితమే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెంకటేష్ నటించిన మల్లీశ్వరి (Malliswari) చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. కె.విజయ భాస్కర్ డైరెక్షన్‍లో వచ్చిన ఈ అప్పట్లో మంచి హిట్‏ను సొంతం చేసుకుంది.. స్పెషల్‏గా త్రివిక్రమ్ (Trivikram Srinivas) పంచ్ డైలాగులు బాగా వర్కవుట్ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)తో అల్లరి పిడుగు చిత్రంలోనూ ఈ భామ నటించింది. కాకపోతే ఆ సినిమా ఎక్స్‏పెక్టేషన్స్‏కు రీచ్ అవ్వలేకపోయింది. తెలుగులో రెండు చిత్రాలకే పరిమితమైన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో ఛాన్స్ లు తగ్గడం.. బాలీవుడ్‏లో అవకాశాలు పెరగడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోయింది కత్రినా కైఫ్. పెళ్లికి ముందు వరకు కూడా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్‏గా ఉందీ పొడుగుకాళ్ల సుందరి.

Updated On 24 April 2023 6:29 AM GMT
Ehatv

Ehatv

Next Story