ఎన్టీఆర్ పిల్లల(Jr. NTR Sons)కు భహుమతు(Gifts)లు పంపించింది బాలీవుడ్ బ్యూటీ(BollyWood Actress) ఆలియా భట్(Alia Bhatt). తారక్ ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసింది. ఈ సడన్ సర్ ప్రైజ్ కు రిటన్ మెసేజ్ పెట్టాడు ఎన్టీఆర్(NTR). ఇంతకీ ఆయన ఏమని రిప్లై ఇచ్చాడంటే..?
ఎన్టీఆర్ పిల్లల(Jr. NTR Sons)కు భహుమతు(Gifts)లు పంపించింది బాలీవుడ్ బ్యూటీ(BollyWood Actress) ఆలియా భట్(Alia Bhatt). తారక్ ఫ్యామిలీని సర్ ప్రైజ్ చేసింది. ఈ సడన్ సర్ ప్రైజ్ కు రిటన్ మెసేజ్ పెట్టాడు ఎన్టీఆర్(NTR). ఇంతకీ ఆయన ఏమని రిప్లై ఇచ్చాడంటే..?
ఫిల్మ్ ఇండస్ట్రీలో భలే సరదా అయిన విషయంఏంటీ అంటే..? కొంత మంది హీరో హీరోయిన్లు.. ఒక్క సినిమాతో బాగ క్లోజ్ ఫ్రెండ్ అయిపోతుంటారు. ఒక్కోసారి వారి ఫ్యామిలీలు కూడా ఫ్రెండ్స్ గా మారిపోతుంటారు. మరికొంత మంది మాత్రం పది సినిమాలు చేసినా.. హాయ్ బాయ్ అన్నట్టుగానే ఉంటారు. ఈ రెండు రకాలలలో మొదటిరకం ఫ్రెడ్షిప్ ఎన్టీఆర్, ఆలియా మధ్య నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన ఈ ఇద్దరు తారలు.. బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారకూ వెళ్ళారు. రీసెంట్ గా తారక్ పిల్లలకు గిఫ్ట్స్ పంపించింది ఆలియా భట్.
నిజానికి ఆర్ఆర్ఆర్ సినిమాలు రామ్ చరణ్ జోడీగా సీత పాత్రలో నటించింది ఆలియా భట్. కాని ఆమె ఎన్టీఆర్ కు మంచి ఫ్రెండ్ గా మారింది. రామ్ చరణ్ కు కూడా స్నేహితురాలే కాని.. తారక్ అంత క్లోజ్ కాలేకపోయింది. అప్పటి నుంచీ తారక్ తో మంచి రిలేషన్ కొనసాగిస్తూ ఉంది. ఇక ఆలియా భట్ ఇటు సినిమాలు చేస్తూ.. అటు గార్మెంట్ బిజినెస్ కూడా చేస్తూ వస్తోంది. ఆమె రెండేళ్ల క్రితం పెళ్ళి కాకముందు.. కాన్షియస్ క్లాతింగ్ పేరుతో గార్మెంట్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. బిజినెస్ కూడా జోరుగా సాగడంతో.. చేతినిండా సంపాదిస్తోంది బ్యూటీ.
అయితే అప్పుడప్పుడు.. తన స్నేహితులకు గిఫ్ట్ ల కింద.. క్లాతింగ్స్ పంపించడం అలవాటు ఆలియా భట్. ఆమధ్య మహేష్ బాబు గారాల పట్టి సితారకుకూడా మంచి డ్రస్ ను గిఫ్ట్ గా పంపిన ఆలియా భట్.. ప్రస్తుతం ఎన్టీఆర్ పిల్లలకు కూడా భహుమతులను పంపించింది. ఎన్టీఆర్ పిల్లలు నందమూరి అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు డ్రస్ లు గిఫ్ట్ గా పంపించింది ఆలియా భట్. అంతే కాదు యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్ లో ప్యాక్ చేసి.. అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో చెరో బ్యాగ్ కు ట్యాగ్ లు పెట్టి పంపించింది.
ఇక ఎన్టీఆర్ ఎంతో సంతోషించి.. ఆలియాకుఇన్ స్టాలో థ్యాంక్స్ చెప్పారు. ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు. అలియా.. నీ క్లాతింగ్ బ్రాండ్ ఎప్పుడూ అభయ్ రామ్, భార్గవ్ రామ్ ముఖాల్లో సంతోషాన్ని ఉంచుతుంది. తన పేరు మీద కూడా ఒక బ్యాగ్ చూడాలనుకుంటున్నా అంటూ స్టోరీ షేర్ చేశారు. అటు ఎన్టీఆర్ పోస్ట్ కు ఆలియ భట్ కూడా రిప్లే ఇచ్చింది. నీకు మాత్రం ఈద్ స్పెషల్ గా డ్రస్ లు రెడీ చేస్తానని.. చెపుతూ.. నువ్వు స్వీటెస్ట్ పర్సన్ వి అని .. థాంక్యూ చెప్పింది బాలీవుడ్ హీరోయిన్. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.